జగనన్న సురక్ష క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి..

-జిల్లాలో 61 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో 42 శిభిరాల ఏర్పాటు..
-అన్ని శిభిరాల వద్ద ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కిట్‌ ఏర్పాటు..
-జాప్యం లేకుండా సకాలంలో శిభిరాలను ప్రారంభించండి..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జూలై 1వ తేది శనివారం జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహించే శిభిరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.జూలై 1వ తేది శనివారం నిర్వహించే శిభిరాలకు చేయవలసిన ఏర్పాట్లపై శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆయన క్యాంప్‌ కార్యాలయం నుండి ఎంపిడివోలు, తహాశీల్థార్లు, మున్సిపల్‌ కమీషనర్లు, మండల స్పెషల్‌ ఆఫీసర్లు, డిప్యూటి తహాశీల్థార్‌, తదితర శాఖల అధికారులతో గూగుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ జూలై 1వ తేది నుండి నిర్వహించే జగనన్న సురక్ష శిభిరాలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దం చేయాలన్నారు. జిల్లాలో 61 గ్రామ వార్డు సచివాలయల పరిధిలో 42 శిభిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వీటిలో నగరపాలక సంస్థ పరిధిలోని నాలుగు వార్డు సచివాలయాలకు సంబంధించి ఒక శిభిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సమస్యలను గుర్తించిన వారిని క్యాంపులకు తీసుకురావాలన్నారు. శిభిరాల వద్ద అర్హులైన వారికి సర్టిఫికేట్లను పంపిణీ చేసేందుకు సిద్దంగా ఉంచుకోవాలన్నారు. ఆధార్‌ నమోదు, సవరణలకు అవసరమైన ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కిట్లును ప్రతీ శిభిరం వద్ద సిద్దంగా ఉంచాలన్నారు. శిభిరాలకు హాజరయ్యేవారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన త్రాగునీరు, కుర్చీలతో పాటు వాటర్‌ఫ్రూఫ్‌ షామియాన ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శిభిరాలు జాప్యం కాకుండా సకాలంలో ప్రారంభం అయ్యేలా అన్ని ముందస్తు ఏర్పాట్లతో సిద్దంగా ఉంచుకోవాలని కలెక్టర్‌ డిల్లీరావు గూగుల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులను ఆదేశించారు. అర్హత కలిగి ఉండి ప్రభుత్వ పథకాల లబ్ది పొందకుండా నిరాశ చెందకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని, క్యాంపులను నిర్వహిస్తున్నారన్నారు. వివిధ కారణాలతో దృవీకరణ పత్రాలు అందని ప్రజలు ఈ శిభిరాలను సద్వినియోగం చేసుకుని వారికి అవసరమైన పత్రాలను పొందవచ్చునని కలెక్టర్‌ డిల్లీరావు కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *