తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల జూలై 4వ తేదీన చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి 09.15 గంటలకు చేరుకుని అక్కడి నుండి 09.25 గం. లకు హెలికాప్టర్లో చిత్తూరు జిల్లాకు బయల్దేరి వెళ్లి అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం తిరిగి మధ్యాహ్నం 02.05 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని 02.15 గం. లకు గన్నవరం తిరుగు ప్రయాణం కానున్నారని వారి భద్రత దృష్ట్యా ASL లో భాగంగా సంబంధిత అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ కె .వెంకటరమణారెడ్డి, జెసి డి కె బాలాజీ, ఎస్పీ పరమేశ్వర రెడ్డి తో కలిసి సమీక్షించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు, అంబులన్స్, సేఫ్ రూమ్, ఫైర్ అధికారులు ఫైర్ సేఫ్టీ చర్యలు, ఫుడ్ సేఫ్టీ తదితర శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఎస్పి మాట్లాడుతూ బందోబస్తు పటిష్టంగా ఉండాలని పోలీసులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీకాళహస్తి రామారావు, ఏర్పోర్ట్ సి ఎస్ ఓ రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ కమాండెంట్ కున్వర్ బహుదూర్, ఏఎస్పీ లు కులశేఖర్, విమల కుమారి, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, డిఎస్పీ లు భవ్యశ్రీ, యశ్వంత్, రవీంద్ర రెడ్డి, రుయా ఆస్పత్రి సూపర్డెంట్ రవి ప్రభు, స్విమ్స్ హాస్పిటల్ సీఎంఓ శివశంకర్, జిల్లా ఆర్ అండ్ బి అధికారి సుధాకర్ రెడ్డి ఇన్స్పెక్టర్ రెడ్డప్ప రెడ్డి, రేణిగుంట తహసిల్దార్ ఉదయ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.