సుపరిపాలనకు నిదర్శనం ‘జగనన్న సురక్ష’

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం సుపరిపాలనకు నిదర్శనమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 28 వ డివిజన్ లక్ష్మీనగర్ లో బుధవారం నిర్వహించిన సురక్ష శిబిరంలో డివిజన్ ఇంఛార్జి కనపర్తి కొండాతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ల‌బ్ధిదారుల స‌మ‌స్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్దేశించిన ల‌క్ష్యాల మేర‌కు యంత్రాంగమంతా క‌లిసి ప‌నిచేయాల‌ని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభనుద్దేశించి ప్రసంగించారు. గతంలో ధ్రువీకరణ పత్రాలు పొందాలంటే రూ. వేలల్లో వెచ్చించాల్సి వచ్చేదని, నెలల తరబడి కాళ్లరిగేలా తిరగవలసి వచ్చేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రభుత్వ కార్యాల‌యాల‌లో ప‌నులు ఆల‌స్యమవుతాయన్న అపోహ‌ను తొల‌గించేందుకు సీఎం జ‌గ‌న్ స‌ర్కారు తీవ్ర కృషి చేస్తోంద‌ని మల్లాది విష్ణు అన్నారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమ‌త్తం చేస్తూ ప‌ని చేయిస్తోంద‌న్నారు. వారం రోజుల పాటు సచివాలయ సెక్రటరీలు, వాలంటీర్లు, గృహ సార‌థులు, కన్వీనర్ల సాయంతో ఇంటింటి స‌ర్వేను నిర్వహిస్తూ.. ప్రజల అవసరాలను తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. డివిజన్ పరిధిలోని 53 క్లస్టర్లలో 3,642 నివాసలుండగా.. 957 మంది వివిధ రకాల పత్రాలు కోసం వినతులు సమర్పించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. వీరిలో 241 మంది కుల సర్టిఫికెట్ల కోసం., 313 మంది ఆదాయ., 17 మంది బియ్యం కార్డుల కోసం అర్జీలు ఇచ్చినట్లు చెప్పారు. వీరందరికీ ఒక్క రూపాయి లంచం లేకుండా., ఎటువంటి సర్వీస్ ఛార్జీ వసూలు చేయకుండా సర్టిఫికెట్లు అందజేసినట్లు చెప్పారు. అలాగే నగర పౌరులు ఎవరైనా ఇతర ప్రాంతాలలో మృతి చెంది స్థానికంగా అంత్యక్రియలు జరిగినట్లయితే.. చుట్టుప్రక్కల ప్రజల పంచనామాతో వారికి ఇక్కడే డెత్ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా ఏప్రిల్ 18, 2022 న రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. కనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తూ.. ప్రజలకు సత్వర సేవలు అందించాలని యంత్రాంగానికి సూచించారు. అనంతరం సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఓయూసిడి శకుంతల, నార్త్ ఎమ్మార్వో ఎం.మాధురి, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *