విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా పరిపాలన ను ప్రజల వద్దకు చేరువ చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ లబ్ది అందజేయడమే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అని తూర్పు నియోజకవర్గ వైసీసీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.బుధవారం నాడు తూర్పు నియోజకవర్గంలో 18వ డివిజన్ సిమెంట్ గౌడౌన్ నందు 82,83,84 సచివాలయాలకు సంబంధించి, 20,21 డివిజన్ క్రిష్ణలంక APSRM స్కూల్, కొత్త కమిటీ హల్ నందు 100,101,103,106,107 సచివాలయాలకు సంబంధించిన వలంటీర్లు చేసిన సర్వేలో ఈ సచివలయాల పరిధిలో దాదాపు 2700 మందికి సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందలేదు అని వారి దృష్టికి తీసుకురాగా వారందరికీ ఇన్ కం,కుల ధ్రువీకరణ,మరణ జనన ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా మంజూరు చేయడం చేసారు.ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందజేస్తున్నామన్నారు. ఏదైనా కారణాల వల్ల ధ్రువీకరణ పత్రాలు అందని ప్రజలకోసం ప్రత్యేకంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.తొంబై రోజుల్లో పేదలకు ఇళ్ల పట్టాలు అందచేసిన ఘనత జగన్ సొంతమని కితాబు ఇచ్చారు..అమరావతి లో ఇళ్ల స్థలాలు వచ్చిన లబ్ధిదారులు నీ అక్కడకు తీసుకెళ్లటం జరిగింది అని అన్నారు.. పేదలకు ఆన్ని విధాల అండగా ఉంటున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అయన తెలిపారు. రాణిగారితోట ప్రాంతంలో కోట్లాదిరూపాయలతో వివిధ అభివ్రద్ధి పనులు చేపట్టామన్నారు. రిటైనింగ్ వాల్ నిర్వాసితులందరికీ ఇళ్ల స్థలాలు అందజేసినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకరన్, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,సి.పి .ఓ జుబిన్, జోనల్ కమిషనర్లు కృష,రవిచంద్,వైస్సార్సీపీ నాయకులు పుప్పాల రాజా,పళ్లెం రవి,విజయలక్ష్మి,దుర్గారావు, క్లస్టర్ ఇంచార్జిలు సాయి కృష్ణా రెడ్డి,రామకృష్ణ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …