ఇకపై ప్రతి శుక్రవారం మహిళా ఆత్మగౌరవ దినంగా నిర్వహిస్తాం.


– సరైన అవగాహనే సైబర్ క్రైమ్స్ కు నివారణ
-మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్ లు పెడితే కఠిన చర్యలు.
-సోషల్ మీడియాలో రాతియుగం కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు
-మహిళలు సాటి మహిళలపైనే అసభ్యకర పోస్ట్ లు పెట్టడం బాధాకరం.
-సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులను ప్రతి ఒక్కరూ ఖండించాలి.
– ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సోషల్ మీడియాలో మహిళలపై అభ్యంతరకర పోస్టులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని, ఇకపై ప్రతి శుక్రవారం మహిళా ఆత్మగౌరవ దినంగా పాటిస్తూ అవగాహన సదస్సులు నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. విజయవాడలోని హోటల్ ఐలాపురంలో సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు అనే అంశంపై ఏపీ ఉమెన్స్ కమిషన్ ఆధ్వర్యలో బుధవారం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సెమినార్ కు అధ్యక్షత వహించిన వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సోషల్ మీడియాలో రాతియుగం కంటే ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలే మహిళలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, రాజకీయ కారణాలతో వారిని మరి కొందరు ప్రోత్సహించటం దారుణమన్నారు.మార్ఫింగ్ ఫోటోలు పెట్టి మహిళలను కించపరుస్తున్న వారి భరతం పట్టాలని, ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశ అత్యున్నత న్యాయ స్థానం ఒక కేసు తీర్పును ఆధారం చేసుకుని సోషల్ మీడియాలో కొందరు రెచ్చిపోతున్నారని ఇది మంచి పద్దతి కాదని హెచ్చరించారు. నేటి కాలంలో సోషల్ మీడియాలో కొందరు ముసుగు వేసుకుని ఇష్టారీతిన మహిళలపై సైతం అసభ్యకరంగా పోస్ట్ లు పెట్టడం బాధాకరమన్నారు. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. మహిళలపై సోషల్ మీడియాలో పెస్టులు పెట్టినా, అసభ్యకరంగా ప్రవర్తించినా దిశ, సైబర్ మిత్ర తదితర యాప్ లద్వారా పోలీస్ వారి సహాయం పొందాలని సూచించారు. ఇలాంటి సంఘటనలపై కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ధైర్యంగా ఫిర్యాదు చేసినప్పుడే సత్ఫలితాలు ఉంటాయన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించి అన్ని అవకాశాలు కల్పిస్తుంటే కొందరు దుర్భుద్దితో మహిళలను కించపరుస్తూ పోస్టులు పెట్టడం బాధాకరమన్నారు.ఈ సెమినార్ మఖ్య ఉద్దేశ్యం ఎవరైనా సరే ఈ రోజు నుంచి మహిళలపై అసభ్యంగా పోస్ట్ లు పెడితే చర్యలు తప్పవన్నారు. ఒక మనిషిని టార్గెట్ చేయాలంటే ఆ ఇంట్లో లోని మహిళలను బయటకు లాగి ఇష్టం వచ్చినట్లు అక్రమ సంబంధాలు అంటగట్టి వారి ఆక్రోశంను వెళ్లగక్కుతున్నారని ఇది మంచి పద్దతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, చైల్డ్ రైట్స్ ఛైర్ పర్సన్ అప్పారావు, రేషిమున్నీషా బేగం, విజయవాడ డిసీపీ అజిత, విజయవాడ డిప్యూటీ మేయర్లు శ్రీశైలజా రెడ్డి, బెల్లం దుర్గా, రిటైర్డ్ ఐఏఎస్ ఉషా కుమారి, ఆచార్య నాగార్జున యూనివర్శిటీ రిజిస్ట్రార్ కరుణ, కీర్తి, రాజ్యలక్ష్మీ, సెర్ప్ డైరక్టర్ విజయ కుమారి, డాక్టర్ శారద, జర్నలిస్ట్ సాయి, చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసరావు, ఐద్వా రమాదేవి, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.జారీ చేసిన వారు : కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *