విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు అత్యత్భుతమని మిషన్ శక్తి ఫౌండేషన్ అస్సాం టీమ్ సభ్యులు కొనియాడారు.జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అమలు జరుగుతున్న వివిధ పథకాలను బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన మిషన్ శక్తి ఫౌండేషన్ అస్సాం టీమ్ సభ్యులు గొల్లపూడిలోని టిటిడిసి భవనంలో నిర్వహించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమ యంత్ర పరికరాల ప్రదర్శనలను పరిశీలించారు.స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపార పారిశ్రామిక రంగాలలో కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేసి మహిళలకు ఆర్థిక పరిపుష్టిని కల్పించే విధానాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కె. శ్రీనివాస్ మిషన్ శక్తి ఫౌండేషన్ అస్సాం టీమ్ సభ్యులకు వివరించారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ మాట్లాడుతూ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పియంఇజిపి), ఫార్‌మైజేషన్ ఆఫ్ మైక్రో పుడ్ ఎంటర్‌ప్రైజెస్ (పియంఎఫ్‌యంఇ) పథకాల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్ధిక పురోభివృద్దికి బాటలు వేసుకుంటున్నారన్నారు. వీరికి ఆర్థిక సహకారం అందించి సమాజంలో ఉన్నత స్థాయిని కల్పించేలా వ్యాపార రంగాలలో అవకాశాలను కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా కారం, పిండి మిషన్లు, చాపాతి తయారీ మిషన్లు, ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లు, ఉద్యాన పంటాలకు అవసరమైన డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆదునీక యంత్రపరికరాలను సంబంధించిన వ్యాపారాలపై స్వయం సహాయక సంఘాల మహిళలు దృష్టి పెడుతున్నారన్నారు. యంత్ర పరికరాల కొనుగోలుకు అవసరమైన పెట్టుబడికి ప్రభుత్వం నుండి అందించే సబ్సిడీకి తోడు బ్యాంకులు అవసరమైన రుణాలను మంజూరు చేసి మహిళలను పారిశ్రామిక రంగంవైపు ప్రోత్సహిస్తున్నామన్నారు. మండలానికి 50 యూనిట్ల లక్ష్యాన్ని నిర్థేశించుకుని జిల్లాలోని 16 మండలాలలో ఈ పథకాలను అమలు చేస్తున్నామని ప్రాజెక్ట డైరెక్టర్ కె. శ్రీనివాస్ మిషన్ శక్తి ఫౌండేషన్ అస్సాం టీమ్ సభ్యులకు వివరించారు.అనంతరం మిషన్ శక్తి పౌండేషన్ అస్సాం టీమ్‌సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో చందర్లపాడు, నందిగామ, కంచికచర్ల, ఇబ్రహీంపట్నంలలో స్వయం సహాయక సంఘాల చేయూత మహిళా మార్ట్, గన్నీ బ్యాగ్స్, పౌల్ట్రీ పుడ్ ప్రాసెసింగ్ యునిట్లు, పేపర్ ప్లేట్స్ మేకింగ్, పికిల్ మేకింగ్ యూనిట్లను పరిశీలించడం జరిగిందని తమ రాష్ట్రంలోను ఇటువంటి తరహ యూనిట్ల ఏర్పాటుకు సిపార్సు చేస్తామని అన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …