విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం నడిబొడ్డున భారతదేశం గర్వించదగ్గ స్మృతుల్లో ఒకరైన అంబేడ్కర్ కు ఘన నివాళిగా 20 ఎకరాల్లో స్మృతివనం, దేశంలోనే అతిపెద్దదైన అంబేడ్కర్ విగ్రహం పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంబేడ్కర్ స్మృతివనం పనులను సజ్జల రామకృష్ణారెడ్డి, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి, విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మన్ మేరుగు నాగార్జున తదితరులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో సమానత్వ దిశగా వడివడిగా అడుగులు వేయటానికి కారణం అంబేడ్కర్ అని కొనియడారు. ప్రజాస్వామ్య పాలనకు బీజం వేసింది అంబేడ్కర్ అని అన్నారు. నేడు ఆరోగ్యకరమైన వాతావారణం ఏర్పడిందంటే అంబేడ్కర్ ఆలోచనే అని తెలిపారు. అసమానతలు తొలిగి సమానత్వంకు పెద్దపీట వేయగలిగామన్నారు. అంబేడ్కర్ పోరాట పటిమను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మనదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందంటే అది అంబేడ్కర్ గోప్పతనమేనన్నారు. భారతదేశాన్ని అంటరానితనం అనే రోగం శతాబ్ధాల తరబడి పీడించిందని, అంతటి రోగానికి మందు వేసి రూపుమాపిన వారిలో అంబేడ్కర్ కు మొదటి స్థానం దక్కుతుందన్నారు. అంతటి మహానుభావుడిని స్మృతి చిహ్నంగా అతిపెద్ద విగ్రహం ఏర్పాటు ప్రతిపాదన చేయటమే కాకుండా ఏర్పాటు చేయటం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కోవిడ్ సమయంలో సైతం అంబేడ్కర్ స్మృతి వనం పనులు మొదలుపెట్టి శరవేగంగా పూర్తిచేయటానికి చర్యలు తీసుకోవటం అభినందనీయమన్నారు. ఈ ఏడాది అంబేడ్కర్ స్మృతి వనం పనులు పూర్తి చేసి దేశానికి, రాష్ట్రానికి అంకితం చేయనున్నామన్నారు. అంబేడ్కర్ స్మృతి వనంలో అంతర్జాతీయ స్థాయి రిసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.దేశంలో, రాష్ట్రంలో అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం అతి త్వరలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జాతి కి అంకితం చేయనున్నాడని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి, విగ్రహ నిర్మాణ కమిటీ ఛైర్మన్ మేరుగు నాగార్జున అన్నారు. డాక్టర్ బి. ఆర్ . అంబేడ్కర్ విగ్రహం దేశంలోనే గొప్ప చారిత్రక కట్టడం కాబోతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గొప్ప ఆశయంతో తీసుకున్న ఈ నిర్ణయం చరిత్ర పుటల్లో లిఖించే విధంగా నిలిచిపోతుందన్నారు. ఆ మహాత్ముని స్మరించుకునేలా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని అన్నారు. అంబేడ్కర్ అతిపెద్ద విగ్రహ ఏర్పాటుకు రూ. 400 కోట్లకు పైగా ఖర్చుపెడుతున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అంబేడ్కర్ విగ్రహ పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారన్నారని, అతి త్వరలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు.కార్యక్రమంలో ఎంఎల్ఏ రక్షణ నిధి, ఎంఎల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, సాంఘీక సంక్షేమ శాఖ డైరక్టర్ విజయ కృష్ణన్, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.జారీ చేసిన వారు : కమిషనర్, సమాచార, పౌర సంబంధాల శాఖ, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …