-షెడ్యూల్ కులాలకు ప్రత్యేక కేటాయింపులపై హర్షం..
-జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు డా. అంజుబాల
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని ముఖ్యంగా షెడ్యూల్ కులాలకు ప్రత్యేక కేటాయింపులు చేయడం పట్ల జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు డా. అంజుబాల అభినందించారు.జిల్లాలో షెడ్యూల్ కులాలకు అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును గురువారం జిల్లా కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు డా. అంజుబాల, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భగా ఎస్సీ కమీషన్ సభ్యులు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం షెడ్యూల కులాల జాతీయ కమీషన్ ఏర్పాటు చేయడం జరిగిందని కమీషన్ ఆయా వర్గాల సంక్షేమం కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుతూ ఉంటుందన్నారు. షెడ్యూల్ కులాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను రక్షిస్తూ విద్యా, వైద్య, ఆర్థిక, సామాజిక ప్రయోజనాల లబ్దిని ఆయా వర్గాలు పూర్తి స్థాయిలో అందేవిధంగా కమీషన్ పర్యవేక్షిస్తుందని జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు డా. అంజుబాల అన్నారు.వైద్య పరంగా షెడ్యూల్ కులాలకు అందిస్తున్న సేవలను కమీషన్ సభ్యులు సమీక్షిస్తూ ప్రధాన మంత్రి మతృ వంద యోజన,జననీ సురక్ష యోజన, జననీ శిశు సురక్ష కార్యక్రమం, ఆయుష్మాన్ భారత్ తదితర పథకాల అమలను సమీక్షించారు. పేద ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం అత్యత్భుతం అని ఈ విధానాన్ని ఆలోచన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కమీషన్ సభ్యులు అంజు బాల ప్రత్యేక అభినందించారు.విద్య పరంగా షెడ్యూల్ కులాలకు అందిస్తున్న సేవలను కమీషన్ సభ్యులు సమీక్షిస్తూ షెడ్యూల్ కులాలకు చెందిన వర్గాలకు విద్య రంగంలో అందిస్తున్న పథకాల లబ్ది చేకూర్చాలన్నారు. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్య దీవెన పథకాల ద్వారా షెడ్యూల్ కులాలకు ఆర్థిక చేయూతను అందించి ఉన్నత స్థాయి లో ఉండేలా ప్రత్యేకంగా పథకాలను రూపొందిచడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ముద్ర యోజన, స్టాండప్ ఇండియా రుణాలను షెడ్యూల్ కులాలకు చెందిన వర్గాలకు మంజూరు చేసిన బుణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా వర్గాలకు బ్యాంకుల ద్వారా పూర్తి స్థాయిలో బుణాలు మంజూరు చేయించి పరిశ్రమల స్థాపన ద్వారా పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు. తద్వారా షెడ్యూల్ కులాల వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారవుతామన్నారు. దీనిని పై త్వరలో మరో సారి జిల్లా అధికారులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తానన్నారు.జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణ తీరు అద్భుతమని అన్నారు. పారిశ్రామికంగా, అధిక జనాభా కలిగిన విజయవాడ నగరంలో శాంతి భద్రతలు కాపాడడంలో కట్టుదిట్టమైన చర్యలుతీసుకుంటున్నారన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఎటువంటి హత్యలు, నేరాలు నమోదుకాకుండా శాంతి భద్రతలను అదుపులో ఉంచుతున్న నగరపోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటాను కమీషన్ సభ్యులు అంజుబాల అభినందించారు.జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 22 లక్షల 18 వేల మంది జనాభా ఉన్నారని వీరిలో 4 లక్షల పైగా షెడ్యూల్ కులాలకు చెందిన జనాభా ఉన్నారని, జనాభా పరంగా వీరి శాతం 21.47 గా ఉన్నాయన్నారు. సాంఫీుక సంక్షేమ వసతి గృహాలలో 933 మంది విద్యార్థులకు వసతి కల్పించామన్నారు. భూమి లేని షెడ్యూల్ కులాలకు చెందిన 6,724 మంది లబ్దిదారులకు భూములను మంజూరు చేయడం జరిగిందన్నారు. నవరత్నాలు పేదలందరికి ఇళ్ళులో భాగంగా 42,814 మంది లబ్దిదారులకు జగన్న కాలనీలో ఇళ్ళ పట్టాలను మంజూరు చేశామన్నారు. వైఎస్సార్ చేయుత ద్వారా 26,592 మంది షెడ్యూల్ కులాలకు చెందిన మహిళలకు రూ. 49 లక్షల 86 వేలు, జగన్న తోడు పథకంలో 3,274 మందికి లబ్ది చేకూర్చామని కలెక్టర్ డిల్లీరావు ఎస్సీ కమీషన్ సభ్యులుకు వివరించారు.సమావేశంలో నగర పోలీస్‌కమీషన్ కాంతి రాణా టాటా, నేషనల్ కమీషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ డైరెక్టర్ డా. సునీల్‌కుమార్‌బాబు, జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, డిఆర్‌వో కె. మోహన్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.