పేదప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత డాక్టర్ వైయస్ఆర్:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా సంక్షేమ పథకాలు పరిచయం చేసి పేదప్రజల ఉన్నతికి కృషి చేసిన మహానేత స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారని, అందుకే నేడు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా సరే నేటికీ ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శుక్రవారం రాజశేఖర్ రెడ్డి గారి 74 వ జయంతి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా వైస్సార్సీపీ నాయకులు ఆయన విగ్రహాలకు పూలమాలలు సమర్పించి పలు సామాజిక సేవ కార్యక్రమంలు చేపట్టగా అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై వాటిని ప్రారంభించి ఆ మహనీయునికు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నాడు ఉమ్మడి రాష్ట్రంలో వైస్సార్ గారు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయగానే పాదయాత్ర లో తాను చూసిన ప్రజల కష్టాలను రూపుమాపేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదు అని ఫీజు రెఅంబేర్స్మెంట్ పెట్టి ఉచిత విద్య ,ఆరోగ్య శ్రీ,108 వంటి పధకాల ద్వారా పేదవారికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందజేసి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.ఎంతో మంది సామాన్యులను నాయకులు గా తీర్చిదిద్ది వారికి అండగా నిలిచిన నిజమైన నాయకుడు వైస్సార్ గారని,నేడు ఆయన తనయుడు గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి సంక్షేమ పాలన అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.రైతుల మొహంలో సంతోషం చూడాలని,వారికి అండగా ఎన్నో పథకాలు పెట్టిన వైస్సార్ జయంతి ని రైతు దినోత్సవంగా చేసుకోవడం గర్వకారణం అని అన్నారు. వైస్సార్ గారు భౌతికంగా దూరమైనా ప్రజల గుండెల్లో ఆయన రూపం నిలిచిపోయింది అని అందుకే టీడీపీ నాయకులు ఓర్వలేక నేటికి ఆయన ను విమర్శిస్తూతున్నారు అని,మిరెన్ని కుయుక్తులు పన్నిన ప్రజల మనస్సు లో ఆయన స్తానం పదిలం అని,ప్రజలు ఆ నమ్మకం తోనే మరో 30 సంవత్సరాలు జగన్ గారికే ముఖ్యమంత్రి గా అవకాశం ఇస్తారని తెలిపారు.వైస్సార్ జయంతి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అనేక సామాజిక సేవలు,చీరలు పంపిణి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఇంత మంచి కార్యక్రమంలు చేపట్టిన వారందరినీ అభినందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పటమాట నందు కేక్ కటింగ్ మరియు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టి పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వెంకట సత్యనారాయణ,రామిరెడ్డి,పుప్పాల రాజా,మాధురి,చింతల సాంబయ్య,ఇంచార్జిలు పద్మావతి,మాగంటి నవీన్,ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య,ఎన్టీఆర్ జిల్లా ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ చిమటా బుజ్జి వైస్సార్సీపీ నాయకులు సెటికం దుర్గా ప్రసాద్,దండమూడి రాజేష్ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు,సోషల్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *