-వరుసగా నాలుగో ఏడాది డా. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం చెల్లింపు..
-గత 2022 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 19,087 మంది రైతన్నలకు రూ. 3.92 కోట్ల లబ్ది..
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు, అననుకూల వాతావరణం వంటి ప్రతికూల పరిస్థితులతో పంట నష్టపోయిన రైతులకు ఉచిత పంటల బీమా ఆపన్న హస్తం లాంటిదని గత ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం వరం లాంటిందని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు.
ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో భాగంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 2022 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు డా. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతరపురం జిల్లా కళ్యాణదుర్గం నుండి కంప్యూటర్ నుండి బటన్ నొక్కి వరుసగా నాలుగో ఏడాది కూడా రైతుల ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు.నగరంలోని జలవనరుల శాఖ ఆవరణంలోని రైతు శిక్షణ కేంద్రంలో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు,డిప్యూటి మేయర్లు ఆవుతు శైలజరెడ్డి, బెల్లం దుర్గ, కార్పొరేష్ చైర్మన్లు టి. శ్రీకాంత్, మనోజ్ కోఠారి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దామోదరెడ్డి, సభ్యులు బ్రహ్మయ్య, నాగుల మీరా హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నుముక గా భావించిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందన్నారు. సాగు చేసిన ప్రతీ ఎకరాన్ని రైతు భరోసా కేంద్రం ద్వారా ఈ`క్రాప్‌లో నమోదు చేయించి నోటిఫైడ్ చేసిన పంటలకు డా. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా బీమా రక్షణ కల్పిస్తున్నారన్నారు. ఒక సీజన్‌లో జరిగిన పంట నష్టానికి మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభంలోనే క్రమం తప్పక పరిహారం చెల్లిస్తున్నమన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలు అననుకూల వాతావరణం వంటి ప్రతికూల పరిస్థితులకు గురైన పంటలను శాస్త్రీయంగా అంచనా వేసి అర్హులైన ప్రతీ ఒక్కరికి పంట నష్ట బీమాను అందిస్తున్నామన్నారు. జిల్లాలో 19,087 మంది రైతులకు 3.92 కోట్ల రూపాయలు పంటల బీమాలో మంజూరైన ఆర్థిక సహాయన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతాంగానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సిద్దం చేశామన్నారు. పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ గ్రామ సచివాలయాలలోనే అర్హుల జాబితాను ప్రదర్శించడం జరిగిందన్నారు. ఈ విధానంతో రైతులు దళారీల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అవస్థలు పడక బీమా సొమ్మును నేరుగానే వారి ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలను రైతులు పాటిస్తూ ఈ `క్రాప్, ఇ కె వై సి నమోదు చేసుకోవడం ద్వారా పరిహారం మంజూరులో ఎటువంటి ఇబ్బందులు ఉండవని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.మాజీ మంత్రి శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతు సంక్షేమమే ద్యేయంగా వ్యవసాయాన్ని పండగా చేస్తూ రైతన్నకు అండగా ఉందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా రైతన్నలపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా రైతుల తరపున పూర్తి ప్రీమియం చెల్లించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుందన్నారు. విత్తనం నుండి పంట విక్రయం వరకు రైతన్నకు కావాల్సిన అన్ని రకాల సేవలు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా మధ్యవర్తులు, దళారిలు ప్రమేయం లేకుండా ఆర్‌బికెలతో అనుసందానించి నేరుగా కల్లం వద్ద ధ్యానం కొనుగోలు చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, దాన్యం కొనుగోలు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, అక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, సూక్ష్మ సెద్యం, పంటతోటల అభివృద్ధి, వైఎస్సార్ యంత్ర సేవా పథకం, విత్తనాల సబ్సిడీ వంటి పథకాల ద్వారా నాలుగు సంవత్సరాలలో రైతన్నల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దాదాపు 1,70,769 కోట్ల రూపాయలు ఖర్చు చేసి లబ్ది చేకుర్చారని శాసనసభ్యులు అన్నారు.
నగర మేయర రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రైతులకు అండగా ఉండాలనే ఆలోచనలతో వారికి ఏ కష్టం, నష్టం వచ్చినా అండదండలు అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలిస్తుందన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతీ రైతు హృదయంలోను చిరస్థాయిగా నిలుస్తారని నగర మేయర్ అన్నారు.కార్యక్రమంలో తొలుత దివంగత మహానేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను జిల్లా కలెక్టర్ డిల్లీరావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ నాగమణమ్మ,సందర్శించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ నాగమణమ్మ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి బాలాజీ కుమార్, వ్యవసాయ శాఖ సయహాక సంచాలకులు అనితా బాను, ఊర్మిళ, రత్నస్వప్న, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …