విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుటుంబ నియంత్రణ కార్యక్రమం అమలులో వివిధ హోదాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సన్మానించడం జరగుతుందని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు.నగరంలోని కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, డియంహెచ్‌వో యం సుహాసినితో కలిసి కుటుంబ పిపిఐ యుసిడి, అంతర్ ఇంజక్షన్, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న వారిని లక్కీడీప్ ద్వారా ఎంపిక చేశారు. శస్త్రచికిత్సలలో ఉత్తమ సేవలందించిన ఆశ కార్యకర్తలు, ఏఎన్‌యంలు, కౌన్సలర్‌లకు, జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమంలో నగదు బహుమతి, ప్రసంసా పత్రం అందజేయడం జరుగుతుందని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.కార్యక్రమంలో జిల్లా డిఎల్ టివోజె ఉషారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గణాంక అధికారి ఎస్ లక్మోజి, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …