స్కానింగ్‌ సెంటర్లను వైద్యాధికారులు తప్పనిసరిగా తనిఖీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్కానింగ్‌ సెంటర్లను వైద్యాధికారులు తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించి గర్భస్థ పిండ లింగ నిర్దారణ నిషేధ చట్టం (పిసిపిఎన్డిటి యాక్ట్‌) నిబంధనల అమలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢల్లీిరావు అన్నారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టం (పిసిపియన్డిటి) అమలుపై శనివారం స్థానిక కలెక్టరేట్‌ క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్‌ ఢల్లీిరావు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా కమిటీ చైర్మన్‌ జిల్లా కలెక్టర్‌ ఢల్లీిరావు మాట్లాడుతూ జిల్లాలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నది ఆకస్మిక తనిఖీలో పరిశీలించాలన్నారు. పరిశీలనలో నిబంధనలను అతిక్రమించిన్నట్లు గుర్తిస్తే ఆయా సెంటర్ల లైసెన్స్‌ లు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. చట్టంలో నిర్దేశించిన ప్రకారం స్కానింగ్‌ సెంటర్లు తప్పనిసరిగా ఫారం ఎఫ్‌ కు సంబంధించి గర్భిణీ స్త్రీల పూర్తి వివరాలను అప్లోడ్‌ చేయాలన్నారు. వీటిలో స్కానింగ్‌ కు సూచించిన డాక్టరు పేరు, పరీక్ష వివరాలు, సంబంధిత గర్భిణీ పేరు అప్పటికే ఉన్న పిల్లల వివరాలు, స్కానింగ్‌ అనంతర రిపోర్ట్‌ లతో కూడిన వివరాలను అప్లోడ్‌ చేయవలసి ఉంటుందన్నారు. అప్లోడ్‌ చేయని, నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్‌ సెంటర్ల లైసెన్స్‌లను రద్దు చేయాలని కలెక్టర్‌ ఢల్లీి రావు అన్నారు.సమావేశంలో 7 కొత్త సెంటర్ల రిజిస్ట్రేషన్‌, 6 సెంటర్ల రెన్యూవల్‌, మార్పులు, చేర్పులు వచ్చిన 8 దరఖాస్తులను సమావేశంలో ఆమోదించారు.సెకండ్‌ అడిషనల్‌ డిస్టిక్ట్‌ జడ్జ్‌ కమ్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జ్‌ ఎ.సత్యానంద్‌ మాట్లాడుతూ కొత్తగా స్కానింగ్‌ సెంటర్లు ఏర్పాటుకు, రెన్యువల్‌కు, మార్పులు, చేర్పులు వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే కమిటీకి నివేదించాలని అన్నారు.సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ఎం. సుహాసిని, సిసిఆర్‌ బి ఏసిపి కే. వెంకటేశ్వరరావు, మెడికల్‌ ప్రాక్టీష్‌నర్‌ డా. వి. పద్మజ, డా. విజశ్రీ, సభ్యులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *