విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నూతనంగా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించే విధంగా సింగల్ డెస్క్ పోలసీ విధానంలో త్వరతగతిన అనుమతులు మంజూరు చేసి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.నగరంలోని స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయ నుండి శనివారం డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీయల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రయోషన్ కమిటీ (డిఐఇపిసి) గూగుల్ కాన్ఫరెన్స్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఆర్థిక ప్రగతి కూడా మెరుగుపడుతుందని అన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రమికవేత్తలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఆన్లైన్ సింగల్ డెస్క్ పోర్టల్‌లో సంబంధిత శాఖలు అనుమతులను త్వరితగతిన మంజూరు చేయడం ద్వారా జిల్లా పారిశ్రామికాభివృద్ధికి తోడ్పాటును అందించినవారవుతామన్నారు. షెడ్యుల్ కులాలు, తెగలకు చెందిన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం వారికి అందించే ప్రోత్సహకాలు, రాయితీలపై అవగాహన కల్పించాలన్నారు. స్టాండప్ ఇండియా పథకంలో విరివిగా బుణాలను మంజూరు చేయాలన్నారు. కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలో సెంటినీ బయోస్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మున్నెరు నది నుండి పైపు లైన్ ఏర్పాటుకు, జి. కొండూరు మండలంలో మీని లెదర్ పార్క్ కోసం భూ కేటాయింపులను కాన్ఫరెన్స్‌లో చర్చించి అనమతులు మంజూరు చేశారు.వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాస పథకంలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించంలో ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో 19 యూనిట్లకు 1 కోటి 32 లక్షల 09 వేల 143 రూపాయలు, జనరల్ కేటగిరిలో 1 యూనిట్‌కు 20 లక్షల రూపాయల పెట్టుబడి రాయితీగా 1 కోట్ల 52 లక్షల 9 వేల 143, రూపాలయతో పాటు, ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ పాలసీ 2010`15 మరియు 2015`20 ఆర్థిక సంవత్సరాలలో పెట్టుబడి రాయతీ, పావలా వడ్డీ రీయంబర్స్మెంట్ పవర్ టారిఫ్, సేల్స్ టాక్స్ రియంబర్స్మెంట్గా 25 యూనిట్లకు ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో 1 కోటి 43 లక్షల 93 వేల 143, జనరల్ కేటగిరిలో 72 లక్షల 66 వేల 6 రూపాయలు మొత్తంగా రూ. 2 కోట్ల 16 లక్షల 37 వేల 49 రూపాయలను ప్రోత్సహాలుగా మంజూరు చేశారు.గూగుల్ కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సుధాకర్, కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శీనివాస్రావు, ఎల్డియం కె. ప్రియాంక, డిఎఫ్వో శ్రీనివాస్‌రెడ్డి, ఫాస్సియా అసోసియేషన్ సభ్యులు మురళికృష్ణ, తదితరులు ఉన్నారు.
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …