విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈనెల 28వ తేదిన ప్రమాణస్వీకారం చేయనున్నారని ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు సంబంధిత అధికారులకు సూచించారు.జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకరం ఏర్పాట్ల పై మంగళవారం జిల్లా కలెక్టర్ విడిది కార్యాలయంలో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు జిల్లా కలెక్టరు ఎస్ డిల్లీరావు, డిసిపి విశాల్ గున్ని, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, డిఆర్‌వో కె. మోహన్ కుమార్, సబ్ కలెక్టరు అదితి సింగ్, ప్రొటోకాల్ డైరెక్టరు బాలసుబ్రహ్మణ్యరెడ్డిలతో సమావేశం నిర్వహించారు.సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జస్టిస్ ఠాకూర్ ప్రమాణస్వీకారానికి సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి తొలుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఆయన కుటుంబ సభ్యులు తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకుంటారని అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్‌మోహన్ రెడ్డి, ఆ తర్వాత గవర్నర్ జస్టిస్ జనాబ్ అబ్దుల్ నజీర్ వీరిని ఘనంగా ఆహ్వానించేలా ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దూల్ నజీర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ చే ప్రమాణస్వీకారం చేయించడం జరుగుతుందన్నారు. ఈప్రమాణస్వీకారానికి హాజరయ్యే శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్రమంత్రులు, ఇతర అతిథిల కోసం ప్రత్యేక సీట్లు కేటాయించాలని అధికారులకు ఆయన సూచించారు. రెవెన్యూ పోలీస్ అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు అన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …