గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 ఓటర్ల జాబితాకి సంబందించి డోర్ టు డోర్ సర్వేను బిఎల్ఓలు ప్రణాళికాబద్దంగా నిర్దేశిత ఎన్నికల సంఘం సూచనల మేరకు చేపట్టాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. మంగళవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో నగరంలో జరుగుతున్న డోర్ టు డోర్ ఓటర్ సర్వే పై సమీక్షా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బిఎల్ఓలు ఓటర్ సర్వే పక్కాగా జరగాలని, ప్రదానంగా ఒకే డోర్ నంబర్ లో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న వాటిని ప్రత్యేకంగా పరిశీలన చేయాలని ఆదేశించారు. సర్వే విధుల్లో ఎక్కడా వాలంటీర్లను ఇన్వాల్వ్ చేయవద్దని స్పష్టం చేశారు. బిఎల్ఓలు నగరపాలక సంస్థ నుండి అందించిన గుర్తింపు కార్డ్ లను ధరించి సర్వేలో పాల్గొనాలన్నారు. డోర్ నంబర్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నూతన ఓటర్లను చేర్చాలని, నూతన డోర్ నంబర్ల పై ప్లానింగ్ కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే సిబ్బంది పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ప్లానింగ్ కార్యదర్శుల ద్వారా నూతన డోర్ నంబర్ కేటాయింపు చేపట్టామన్నారు.నగర ప్రజలు కూడా తమ ఇంటి వద్దకు ఓటర్ సమాచారం కోసం వచ్చే బిఎల్ఓలకు తగిన సమాచారం అందించి సహకరించాలని, ఎన్నికల సంఘం నెల రోజులపాటు ఓటర్ల లిస్టు లు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఎటువంటి పొరపాట్లు లేని ఓటర్ల లిస్టు తయారికి స్పెషల్ క్యాంపెయిన్ చేపట్టిందన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్ పెద్ది రోజా, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఎన్నికల విభాగ సూపరిండెంట్ పద్మ పాల్గొన్నారు.
Tags gunter
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …