-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 42 వ డివిజన్ లో హౌసింగ్ బోర్డు కాలనీ మరియు 43 వ డివిజన్ పరిధిలో ఊర్మిళ సుబ్భారావు నగర్ నందలి అమృత్ పధకం క్రింద పైప్ లైన్స్ కోసం తవ్విన రోడ్డు పునరుద్ధరణ పనులు మరియు ఊర్మిళ సుబ్భారావు నగర్ నందలి మేజర్ డ్రెయిన్ పనులను, పారిశుధ్య నిర్వహణ తీరును క్షేత్రస్థాయి గురువారం సాయంత్రం కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. అమృత్ పధకం క్రింద పైప్ లైన్స్ కోసం తవ్విన రోడ్డు పునరుద్ధరణ పనులను వారం రోజులలో పూర్తి చేయాలనీ సంబందిత అధికారులను ఆదేశించారు. సదరు రోడ్ల యందు జరుగుతున్న డ్రెయిన్ పనుల పురోగతిని పర్యవేక్షించి నిర్మాణ పనులు వేగవంతము చేయునట్లుగా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఆయా పరిసర ప్రాంతాలలోని సైడ్ డ్రెయిన్ ద్వారా మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని, పాడైన డ్రెయిన్లకు తగిన మరమ్మత్తులు నిర్వహించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కమిషనర్ గారి తో 43 వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర రెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.