విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఇంటి గ్రేటెడ్ నేషనల్ వెట్రన్ ఆర్గనైజేషన్ (ఇన్వో), నేషనల్ ప్రెసిడెంట్ మాజీసైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు తమ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోటూరి శంకర్‌రావు మాట్లాడుతూ మాజీ సైనికులమైన మేము వయస్సు అంకెలలో మాత్రమే కానీ ఇప్పటికీ దేశం కోసం ప్రాణాలైన అర్పించడానికి సిద్ధంగా వున్నామన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాలలో నివసిస్తున్న భారత పౌరులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ జెండాను ఎగురవేయడమంటే స్వేచ్చను అనుభవించడమేనని వ్యాఖ్యానించారు. బ్రిటీష్ నిరంకుశత్వ పాలనకు ప్రతిఘటించి వారిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వారిలో ఎందరో నాయకులు వున్నారన్నారు. వారిలో గాంధీ మహాత్ముడు, జాతికే కేతనం ఇచ్చిన పింగళి వెంకయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, కాశీనాథుని నాగేశ్వరరావు.. ఇలా ఎందరో మహనీయులు స్వాతంత్య్రోద్యమానికి ఊపిరి పోసి, దేశ దాస్య శృంఖలాలను తెంచడంలో ముఖ్యభూమిక పోషించారన్నారు. మనదేశాన్ని ప్రపంచ పఠంలో అగ్రగామిగా నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామన్నారు. ఈ 77 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నామని, ఎంతోమంది స్వాతంత్ర యోధులు భారత స్వాతంత్య్రం కోసం పోరాడారని అలాగే మనం అందరం కూడా దేశాభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. భావితరాల యువత ప్రతివారు ఒక సైనికుడులాగా ఒక గమ్యాన్ని ఏర్పరుచుకుని దానిని సాధించి తనతోపాటు దేశానికి పేరు ప్రతిష్టలు సాధించాలన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …