అమరవీరుల త్యాగాల స్ఫూర్తి నింపుకొని జిల్లా అభివృద్ధికి పునరంకితమవుదాం – మంత్రి ఆర్కే రోజా

 

-జాతీయ సమైక్యత సమగ్రత ప్రతిబింబించే విధంగా ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక పోలీస్ కవాతు మైదానంలో జిల్లా యంత్రాంగం ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించింది.రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభ్యుదయ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆర్కే రోజా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ పి జాషువా, ప్రజాప్రతినిధు లతో కలసి ఇన్చార్జి మంత్రి జాతీయ జెండా ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరంపోలీస్ కవాతు పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి వివరించారు. కుల మత ప్రాంతాల పార్టీలకతీతంగా అర్హత ప్రామాణికంగా నవరత్నాల పేరుతో ప్రభుత్వం పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు దేశమంతా మన రాష్ట్రం వైపే చూసే విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం విప్లవాత్మకమైన పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.రైతుల సంక్షేమానికి అమలు చేస్తున్న రైతు భరోసా పిఎం కిసాన్ క్రింద గత నాలుగేళ్లలో 1.51 లక్షల మంది రైతులకు 824.26 కోట్లు అందించినట్లు, వరుసగా 5వ ఏడాది జిల్లాలో 1.55 లక్షల మంది రైతులకు మొదటి విడత 116 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారుప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద జిల్లాలో 188 గ్రామ సచివాలయాల పరిధిలో 37.60 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 896 పనులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమం కింద 2.52 లక్షల మందికి వారికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా అందజేశామన్నారు.నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద జిల్లాలో 1616.83 కోట్ల రూపాయలతో 89,824 గృహాలు మంజూరు చేయగా ఇందులో 84,783 గృహ నిర్మాణాలు మొదలుపెట్టి సుమారు 20,000 గృహాలు పూర్తి చేసినట్లు తెలిపారు.ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోందన్నారు అమ్మ ఒడి కార్యక్రమం కింద 2022-23 విద్య సంవత్సరంలో జిల్లాలో 1.29 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు 194.29 కోట్ల రూపాయలు వారి తల్లుల ఖాతాల్లో తమ చేసామన్నారువృద్ధాప్యంలో అవ్వ తాతలకు ఆసరాగా వైయస్సార్ పింఛన్ కానుక కింద జిల్లాలో గత నాలుగెల్లుగా 2,611 కోట్ల రూపాయల పింఛన్లు మొత్తాన్ని అందించామన్నారు.స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు ప్రతీకగా తెల్ల పావురాలు విడుదల చేశారు.దేశ స్వతంత్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ దేశభక్తి పెంపొందించే విధంగా వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.జిల్లా అగ్నిమాపక శాఖ బృందం గ్యాస్ ప్రమాదాలు నివారణోపాయాలు గురించి నిర్వహించిన డెమో ఆకట్టుకుంది.జిల్లా అభివృద్ధి కళ్లకు కట్టే విధంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ప్రదర్శించిన అలంకృత శకటాలు ఈ వేడుకల్లో హై లైట్ గా నిలిచాయి.జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ మంత్రివర్యులు , జిల్లా కలెక్టర్ పరిశీలించారు.జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన జిల్లా అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్  ఉప్పాల హారిక, పామర్రు శాసనసభ్యులు అనిల్ కుమార్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, అడిషనల్ ఆర్. హరి బాబు, డి ఆర్ ఓ ఎం. వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *