Breaking News

సెప్టెంబర్ 9 న జాతీయ లోక్ అధాలత్

-న్యాయ సేవలు, చట్టాలు, అర్హులకు అందించే పథకాల పై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి..
-అర్హులందరికీ ప్రతి పథకం వర్తింపచేయాలి..
-విద్యార్థుల్లో జాతీయభావాన్ని పెంపొందించాలి..
-జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు డిఎల్ఎస్ఏ అధ్యక్షులు శ్రీమతి గంధం సునీత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగువ పేర్కొన్న 15 ప్రాంతాల్లోని 64 కోర్టుల యందు ది. 9.9.2023 న ( 2వ శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించ బడునని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి గంధం సునీత శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. స్థానిక జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఛాంబరులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు డిఎల్ఎస్ఏ కార్యదర్శి సీనియర్ న్యాయమూర్తి శ్రీమతి కే. ప్రత్యూషకుమారి పాల్గొన్నారు. రాజమహేంద్రవరం , అమలాపురం , కాకినాడ , పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, ఆలమూరు, తుని, ముమ్మిడివరం, కొత్తపేట, ప్రత్తిపాడు, అనపర్తి, రంపచోడవరం, అడ్డతీగల కోర్టు ల పరిధిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు, కోర్టులలో పెండింగ్ లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు రాజీపడ్డదగ్గ క్రిమినల్ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరింపబడునని తెలిపారు. కావున కక్షిదారులందరు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుని జిల్లా వ్యాప్తంగా జరుగు జాతీయ లోక్ అదాలత్ నకు ది. 9.9.2023 న ( రెండవ శనివారం ) ఉదయం 10 గంటల నుండి తమ యొక్క కేసులను ఆయా కోర్టుల నందు పరిష్కరించు కొనవలసినదిగా తెలియ జేయడమైనది. కావున వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని కోరారు.

నల్సా పథకం :-
నల్సా పథకం 2015 లో భాగంగా బాల బాలికలకు స్నేహపూర్వక న్యాయ సేవలు, సంరక్షణ కార్యక్రమం ద్వారా జిల్లా పరిపాలన విభాగం, విద్య శాఖ, అడ్వకెట్లు, పారా లీగల్ వాలంటీర్ లు, స్వచ్ఛంద సంస్థలతో కూడి బృందాలను ఏర్పాటు చేసి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అన్ని విద్యా సంస్థలలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు పై జిల్లా ప్రధాన న్యాయమూర్తి వివరించారు. వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన, మంచి స్మర్శ, చెడు స్పర్శ ల మధ్య తేడా తెలియ చెయ్యడం జరుగుతుంది అని అన్నారు. సంబంధిత వివరాలు తెలియచేసేలా తరగతి గదిలో, స్కూల్స్, కాలేజ్ లలో పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థుల్లో సోదరభావాన్ని , దేశభక్తి, జాతీయ భావం పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆ క్రమంలో చిత్ర లేఖనం వ్యాస రచన, లలిత కళలు పోటీలు నిర్వహించాలని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15 సందర్భంగా పోటీలు నిర్వహించి, విద్యార్థులకు బహుమతులు అందజేశామన్నారు.

ఉచిత న్యాయ సేవల పై :-
గౌరవ న్యాయ స్థానాలు వివిధ వర్గాల ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు అందించడం జరుగుతోందని వీటిపై ఆయా వర్గాల ప్రజలకు అవగాహన కల్పించడంలో పాత్రికేయులు తమ వంతు కర్తవ్యాన్ని పోషించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి గంధం సునీత కోరారు. ఎస్సీ , ఎస్టీలకు చెందిన వారు మానవ అక్రమ రవాణా భాదితులు, మహిళలు, పిల్లలు, భిక్షాటన చేయువారు, మతి స్థిమితము, మానసిక చికిత్స పొందుతున్నవారు, దివ్యాంగులు, ప్రకృతి విపత్తులు, ఇతర వివిధ విపత్తుల్లోని చిక్కుకున్నభాధితులు, కార్మికులు, అనైతిక, చట్టంతో విభేదించిన బాలలకు, వార్షిక ఆదాయం రు.3 లక్షలకు మించని వారు కూడా ఉచితంగా న్యాయసేవలు పొందువచ్చున్నారు. అందుకు గాను అర్హత గల వ్యాది, ప్రతి వాదులను కూడా న్యాయ సహాయం పొందవచ్చునన్నారు.

అసంఘిటిత రంగం పై :-
అసంఘిటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు బీమా భద్రతను కల్పించేందుకు ఈ – శ్రమ్ పోర్టల్ ద్వారా వారి పేర్లు నమోదు చేయించవలసి ఉంటుందన్నారు. భవన నిర్మాణ రంగంలో 3,17,707 మంది అసంఘిటిత కార్మికులు ఉన్నట్లు గుర్తించామన్నారు. వలస కూలీలను గుర్తించి వారి ఆధార్, రేషన్ కార్డులు కల్పించే అవకాశం ఉందని ఆమేరకు వివరాలు తెలియపర్చితే అటువంటి వారికి న్యాయ సేవాధికార సంస్థ చొరవ చూపి అందజేసేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

పేద నిరుపేద వర్గాల ప్రజలకు ప్రభుత్వం పథకాలపై అవగాహన లేని ప్రతి ఒక్కరికీ ఆయా పథకాలపై అవగాహన కల్పించేందుకు క్షేత్ర స్థాయిలో డిఎల్ఏసి, జిల్లా పరిపాలా యంత్రాంగం ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మోడల విలేజ్ లను గుర్తించడం లో భాగంగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు మేరకు జిల్లాల్లో రెండు వివాద రహిత, ఫిర్యాదు లేని గ్రామాలను గుర్తించాలని కోరడం జరిగిందన్నారు. ఆమేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిథిలో గల నాలుగు జిల్లాలలో తూర్పుగోదావరి జిల్లాలో తొర్రెడు, కాకినాడ జిల్లాలో రంగంపేట, కొత్తూరు, ఏఎస్ఆర్ జిల్లాలో నెల్లిపూడి గ్రామాలను వివాద రహిత, ఫిర్యాదు లేని గ్రామాలను గుర్తించి నివేదిక పంపామన్నారు. ప్రతి 15 రోజులకు ఒక సారి న్యాయ వాదులు డిఎల్ ఎస్ ఏ సభ్యుల, ఎమ్ ఎల్ ఎస్ ఏ, పిఎల్ వి, స్వచ్చంద సంస్థలతో సమావేశాన్ని నిర్వహించి ఆమేరకు నివేదిక పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు.

సామాజిక సేవా బాధ్యత ఎంతో అవసరం :
సామాజిక సేవా బాధ్యత కింద జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలను గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ది కార్యక్రమాలు అర్హులకు అందుతున్నాయో లేదో తెలుసుకొనేందుకు ఆయా శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్న ట్లు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి శ్రీమతి గంథం సునీత పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *