Breaking News

వైద్య కళాశాల మొదటి ఏడాది వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల మొదటి ఏడాది వైద్య విద్యార్థులకు జీ జీ హెచ్ ప్రిన్సిపల్ డా బి. సౌభగ్య లక్ష్మి శుభాకాంక్షలు తెలియ చేసారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుసంధానంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాల విద్యార్థులు ఎంతో క్రమశిక్షణ తో కూడి వైద్య విద్యను అభ్యసించి, మన కళాశాల కు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. ఈ కళాశాల కు 4 కేటగిరీ లలో కేటాయించిన 150 సీట్ల కు గాను 123 అడ్మిషన్లు పూర్తి అయి నట్లు ఆమె తెలిపారు. తొలిరోజు తరగతులకు 74 మంది వైద్య విద్యార్థులు హజరవ్వడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా చరిత్రలో రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ మొదటి ఏడాది తరగతులు ప్రారంభం అవ్వడం తో ఒక నూతన అధ్యయనంకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా జీ జీ హెచ్ సూపరింటండెంట్ డా సూర్య ప్రభ, పలు విభాగాలకు చెందిన హెడ్స్ , డాక్టర్లు, మెడికో విద్యార్థులకు ఏం బి బి ఎస్ పై అవగాహన కలుగ చెయ్యడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *