Breaking News

గోపాలపురం ఎంపిడివో కార్యాలయంలో సెప్టెంబర్ 8 శుక్రవారం జేకేసి అర్జీల పరిష్కార సమావేశం

-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కు చెబుదాం అర్జీల పరిష్కారం కోసం మండల పరిధిలో బుధవారం, శుక్రవారం సమావేశాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో జగనన్న కు చెబుదాం కార్యక్రమాన్ని జిల్లా పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో బుధవారం, శుక్రవారం నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్రమంలో గోపాలపురం మండలంలో తొలి “జే కే సి ” అర్జీలను స్వీకరించే కార్యక్రమాన్ని సెప్టెంబర్ 8 వ తేదీ శుక్రవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలోని 19 మండలాల్లో ఆమేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం షెడ్యూల్ ముందస్తుగా ఇవ్వడం జరుగుతున్నట్లు మాధవీలత పేర్కొన్నారు. ఈ అర్జీల పరిష్కారం కోసం నిర్వహించే కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు హాజరై ప్రజల నుంచి వచ్చిన అర్హత కలిగిన జేకేసి అర్జీలను పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక గోపాలపురం ఎంపిడివో కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొని జేకేసి అర్జీలని పరిష్కరిస్తామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *