Breaking News

సెప్టెంబర్ 30 నుంచి జె ఏ ఎస్ ద్వారా గ్రామాల్లో వైద్య సేవలు

-గ్రామ హెల్త్ క్లినిక్ పరిధిలో , పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్య శిబిరాలు
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఆరోగ్య సురక్ష (జాస్) అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం ఉదయం సి ఎం ఓ కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్ టి కృష్ణ బాబు అమరావతి నుంచి “జస్” పై కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా కే. మాధవీలత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని, ఆమేరకు అధికారులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు విధులను నిర్వర్తించడం జరగాలన్నారు. సెప్టెంబర్ 30 నుంచి గ్రామ స్థాయి లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం తహశీల్దార్, ఎంపీడీఓ లు పూర్తి సమన్వయం తో పనిచేస్తూ, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు, సమయ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. సెప్టెంబర్ 6 వ తేదీన సమన్వయ శాఖల ద్వారా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చెయ్యాల్సి ఉందన్నారు.

సెప్టెంబర్ 15 నుంచి వాలంటీర్ ఇంటింటికీ తిరిగి సమగ్ర ఆరోగ్య వివరాలు తెలుసుకుని, వాటిని నిర్దేశించిన ” జే ఏ ఎస్ ” యాప్ లో పేర్కొన్న విధంగా డేటా సేకరణ చేసి, నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. గ్రామ ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం, సభ్యుల వివరాలు సమగ్రంగా నమోదు పూర్తి చెయ్యాల్సి ఉంటుందన్నారు. గ్రామ పరిధిలో షెడ్యూల్ ప్రకారం ” జస్ ” నిర్వహించే 15 రోజుల ముందే గ్రామ వాలంటీర్, ఏ ఎన్ ఎం వెళ్ళే ముందు రోజు సమగ్ర డేటా ఎంట్రీ పూర్తి చెయ్యాలని, గ్రామ పరిధిలో జరిగే మెడికల్ క్యాంపు నకు హాజరు కావాలని పేర్కొన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ పరిధిలో తప్పనిసరిగా మందులు సిద్దం చేసుకుని, అవసరమైన మెడికల్ కిట్స్ కూడా అందుబాటులో ఉంచుకోవాలి అని స్పష్టం చేశారు. ఇద్దరు వైద్య అధికారులు తో పాటు స్పేషలిస్ట్ డాక్టర్లు కూడా ” జే ఎ ఎస్ ” మెడికల్ క్యాంపు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. జిల్లా స్థాయి లో డి ఎం హెచ్ ఓ, డి సి హెచ్ ఎస్ సమన్వయ కమిటీలో గ్రామ వార్డు సచివాలయాలు, జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ బాధ్యత నిర్వర్తించాలని స్పష్టం చేశారు. మండల స్థాయి లో తహశీల్దార్, ఎంపీడీఓ, పి హెచ్ సి వైద్యులు, సిడిపివో, మండల విద్యా అధికారి పర్యవేక్షణ బాధ్యతలను సక్రమంగా అమలు చేయాలని కోరారు. ఆయా రోజుల్లో జే ఎ ఎస్ నిర్వహించేలా మౌలిక సదుపాయాలు ముందస్తుగా సిద్దం చేసుకోవాలని మాధవీలత పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *