Breaking News

కొవ్వూరు డివిజన్ లో 7150 పాడి పశువుల కొనుగోళ్లు పూర్తి చెయ్యండి

-పాల వ్యాపారం కోసం రూ 30 వేల స్వల్ప కాలిక పెట్టుబడి సహాయం అందించాలి
-కలెక్టర్ మాధవీలత, జేసీ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాల వెల్లువ లబ్ధిదారులకు ముందస్తు పెట్టుబడి సహాయం కోసం స్వల్ప కాలిక రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కొవ్వూరు డివిజన్ పరిధిలో జగనన్న పాల వెల్లువ యూనిట్స్ గ్రౌండింగ్ పై క్షేత్ర స్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, కమిషనర్ దినేష్ కుమార్ లతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జగనన్న పాల వెల్లువ లో భాగంగా అమూల్ పాల కేంద్రాలకు పాలు పోసే లబ్ధిదారులకు ప్రోత్సాహం అందించే క్రమంలో స్వల్ప కాలిక రుణాలను మంజూరు చేయాలని కోరారు. ఇందుకోసం డివిజన్ పరిధిలో 1152 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరి ఒక్కొక్కరికి రూ.30 వేల ను పెట్టుబడి సహాయం కింద అందచేసి, అమూల్ కేంద్రాలకు సరఫరా చేసే విధానం లో రుణాలను చెల్లింపు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకోసం డిసిసిబి, జాతీయ బ్యాంకులు, నుంచి పశు కిసాన్ క్రెడిట్ కార్డు లను అందచేసే, 10 రోజుల్లో గ్రౌండింగ్ చెయ్యాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, జగనన్న పాల వెల్లువ పథకం అమలులో కొవ్వూరు డివిజన్ పరిధిలో ఉన్న కొవ్వూరు , తాళ్లపూడి, చాగల్లు, దేవరపల్లి , నల్లజర్ల, గోపాలపురం మండలాల్లో 7,150 యూనిట్స్ గ్రౌండింగ్ చెయ్యాలని ఆదేశించారు. ఆమేరకు డిసిసిబి, జాతీయ బ్యాంకులు, స్త్రీ నిధి, ఉన్నతి పథకాల కింద లబ్దిదారుల ఎంపిక పూర్తి చెయ్యాలని కోరారు. ఆయా పశువుల కొనుగోలు చేసి, ఆమేరకు వారికి పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ కి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా పశు సంర్ధక శాఖ, సహకార శాఖ, డి ఆర్ డి ఎ , బ్యాంకర్స్ సమన్వయం సాధించడం ముఖ్యం అన్నారు.

ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, జిల్లా పశు సంవర్ధక అధికారి డా ఎస్ జి టి సత్య గోవింద్, డి ఆర్ డి ఎ పిడి ఎస్. సుభాషిణి, జిల్లా సహకార అధికారి వై. ఉమా మహేశ్వర రావు, ఎల్డిఏం డి బి ప్రసాద్, కొవ్వూరు డివిజన్ డిసిసిబి అధికారి రమేష్ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *