Breaking News

వసతి గృహాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి వారు గణేష్ చౌక్ సమీపంలోని ప్రభుత్వ సామాజిక సంక్షేమ బాలికల వసతి గృహము మరియు ప్రభుత్వ బి.సి. సంక్షేమ కళాశాల విద్యార్ధినుల వసతి గృహమును సందర్శించారు. ఆయా వసతి గృహాల పరిసరాలను, వసతులను పరిశీలించిన అనంతరం పరిసరాలను మరింత పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్ధులకు కల్పించే వసతుల్లో ఎలాంటి లోటు చేయరాదని పర్యవేక్షకులతో చెప్పారు. ముఖ్యంగా టాయిలెట్ల తలుపులు సరైన పరిస్థితిలో లేకపోవడంతో న్యాయమూర్తి సంబంధిత అధికారులకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. తరువాత బాలికలతో కాసేపు మాట్లాడారు. బాలికలు విద్యను అశ్రద్ధ చేయరాదని, స్వయం కృషితో ఉన్నత స్థాయికి ఎదిగి ఆర్ధికంగా బలపడాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *