-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మరియు సెంట్రల్ నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అయిన స్వప్నిల్ దినకర్ పుండ్కర్, మంగళవారం ఉదయం తమ చాంబర్లో పొలిటికల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పొలిటికల్ పార్టీ ప్రతినిధులు ఓటర్ల జాబితాల విషయంలో తమ అభ్యర్థనలు కమిషనర్ కి చెప్పగా. ఓటర్ల జాబితా పారదర్శకంగా జరగాలని ఎటువంటి తప్పులు ఉండకూడదని అధికారులకు ఆదేశాన్ని ఇచ్చారు. విజయవాడలో ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని కేంద్రాల ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు బి ఉమామహేశ్వరరావు (TDP), ఎం సాంబశివరావు(TDP), వై సుందర్ పాల్ (YSRCP), ఎం వినోద్ కుమార్ (బహుజన్ సమాజ్ పార్టీ), సిటీ ప్లానర్ జీవి జీ ఎస్ వి ప్రసాద్, జెడ్ సి-2 మల్యాద్రి, తాసిల్దార్ సెంట్రల్ వెన్నెల శ్రీను, ఎస్ ఇ (ప్రాజెక్ట్స్) కే రామ్మోహన్రావు, ఏసిపి -2 ఎం జగదీష్, నార్త్ తాసిల్దార్ ఎం మాధురి, తదితరులు పాల్గొన్నారు.