రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 72 వేల హెక్టార్లలో ప్యాడి సాగు విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు 11.3 శాతం కోతలు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ లతో ఎమ్ ఎస్ ఎం ఈ, హౌసింగ్, రెవెన్యూ రీ సర్వే, జాతీయ రహదారులు, వ్యవసాయం, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, పి ఆర్ లో ప్రాధాన్యత భవనాలు, ఉపాధిహామీ, స్వమిత్వా, కుల గణన, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ దృశ్య మాలిక సమావేశ మందిరం నుంచి కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భం గా కలెక్టర్ మాధవీలత జిల్లా ప్రగతి పై వివరాలు తెలియచేస్తూ, జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన గన్నీ బ్యాగులను అందుబాటులో ఉండే విధంగా చర్యలు పూర్తి చేశామన్నారు. క్షేత్ర స్థాయిలో వెళ్లి ధాన్యం తేమ శాతం గుర్తించేందుకు రెవెన్యూ, వ్యవసాయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ప్రతిపాదించిన 53 ఎమ్ పి ఎఫ్ సి కేంద్రాలకు చెంది స్థలాలు గుర్తింపు పూర్తి చేసినట్లు తెలిపారు. వాటిలో 46 చోట్ల స్థలాలు అప్పగించడం జరిగిందని, మిగిలిన ఏడు పురోగతి ప్రక్రియలో ఉన్నట్లు వివరించారు. జగనన్న పాలవెల్లువ కి చెంది డిసిసిబి , ఇతర బ్యాంకుల ఆధ్వర్యంలో మరిన్ని యూనిట్స్ గ్రౌండింగ్ కు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో రెండో దశ 19253 ఇండ్ల నిర్మాణ లక్ష్యం కుగాను గత 15 రోజుల్లో ఇచ్చిన లక్ష్యంలో 1944 ఇండ్ల నిర్మాణాలు స్టేజి కన్వర్షన్ సాధించడం జరిగిందని, ఇప్పటి 2570 ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయినట్లు పేర్కొన్నారు. పూర్తి చేసిన ఇండ్లకు సమాంతరంగా విద్యుత్, త్రాగునీటి వ్యవస్థ, సోప్ పిట్స్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని వివరించారు. ఇండ్ల నిర్మాణాల కోసం 82 శాతం మంది లబ్ధిదారులకు ఎస్ హెచ్ జి రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. లబ్ధిదారులకు రూ. 35 వేల నుంచి రూ.60 వేల వరకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర కు చెంది రూట్ మ్యాప్ సిద్దం చెయ్యడం జరుగుతుందని, జిల్లా కమిటీ , మండల, మునిసిపల్ స్థాయి కమిటీ లను ఏర్పాటు కు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రాధాన్యత భవనాలు అప్పగింత కు చెందిన నవంబర్ 8 నాటికి గ్రామ సచివాలయ భవనాలు 15 కు గానూ 15 , అర్భికే లు 17 కు గానూ 20 , వైయస్ఆర్ హెల్త్ క్లినిక్స్ 31 కు గానూ 26 అప్పగించడం జరిగిందన్నారు. ప్రాధాన్యత భవనాల మిగిలిన పెండింగ్ పనులను పూర్తి చెయ్యడం కోసం వీక్లీ లక్ష్యం ఇవ్వడం తో పాటు క్షేత్ర స్థాయి అధికారులు, ఇంజనీరింగ్ సహయకులతో ప్రతిరోజూ పిఆర్ అధికారులు సమీక్ష పై ఆదేశాలు జారీ చేశామన్నారు. రీ సర్వే, స్వమిత్వా తదితర అంశాలపై జిల్లా ప్రగతిని వివరించడం జరిగింది. కుల గణన కు చెంది గ్రామీణ, అర్బన్ పరిధిలో సమగ్ర డేటా నమోదు కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ మాధవీలత తెలియ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని సమాయత్తం చెయ్యడం ద్వారా నిర్ణీత వివరాలను నిర్దేశించిన యాప్ లో నమోదు కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు . మార్గదర్శకాలు మేరకు ప్రతి ఒక్క వాలంటీర్ కు సచివాలయ సిబ్బందిని అనుసంధానం చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశం లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (కే ఆర్ ఆర్ సి) రమావత్ నాయక్, ఎస్ ఈ ఎస్ బి వి ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, ఎస్ ఈ పి ఆర్ ఎస్ బి వి ప్రసాద్, సిపివో ఏ..ముఖ లింగం, డ్వామా పిడి పి. జగదాంబ, డిసివో వై. ఉమా మహేశ్వర రావు, పశు సంవర్ధక అధికారి డా ఎస్ జీ టి సత్యగోవింద్, హౌసింగ్ పిడి జి. పరశురామ్, జిల్లా ట్రైబల్ సంక్షేమ అధికారి కె యస్ జ్యోతి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ లు ఏం . భానుప్రకాష్, పి. సువర్ణ, ఇతర అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News