రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
1995లో అమల్లోకి వచ్చిన 1987 లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ ప్రారంభానికి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తేదీన జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపు కుంటున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు.
జాతీయ న్యాయ సేవలు దినోత్సవం పురస్కరించుకొని గురువారం స్థానిక జిల్లా కోర్టు లో గల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో న్యాయ సేవలో అంశంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, 1 వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ఆర్. రాజీవ్, పర్మినెంట్ లోకాదలత్ చైర్మన్ ఏ.గాయత్రీ దేవి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రత్యూష కుమారి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి యు వి బి రాజు, అదనపు న్యాయ మూర్తులు, సీనియర్ మరియు జూనియర్ సివిల్ న్యాయ మూర్తులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని రూపొందించి నప్పుడే అందరికీ ఉచిత న్యాయాన్ని అందించాలని భారత ప్రభుత్వం ఆర్టికల్ 39 ఏ లో రూపొందించిందని పేర్కొన్నారు. లీగల్ సర్వీసెస్ అధారిటీ చట్టాన్ని ఏర్పాటు చేసిన రోజు నుంచి అదే రోజు నుంచి మనం న్యాయ సేవ దినోత్సవం గా జరుపుకుంటున్నా మన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 9 న, అన్ని రాష్ట్ర అధికారులతో కలిసి న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకుంటున్నా మన్నారు. లీగల్ సర్వీసెస్ డేకి సంబంధించిన టాస్క్‌లు మరియు క్యాంపులలో ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలకు చెందిన వ్యక్తులను భాగస్వామ్యం చేస్తూ పాల్గొనేలా చెయ్యడం జరుగుతోందని అన్నారు.
లీగల్ అవేర్‌నెస్ అండ్ అవుట్‌రీచ్ క్యాంపెయిన్ లో భాగంగా ఇంటింటికీ ప్రచారాలు, న్యాయ విద్యా కార్యక్రమాలు, మొబైల్ వ్యాన్ అవగాహన ప్రచారాలు మరియు న్యాయ సహాయ క్లినిక్ అవగాహన ప్రచారాలు జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు.
మహిళలు, వికలాంగులు, షెడ్యూల్డ్ తెగలు, పిల్లలు, షెడ్యూల్డ్ కులాలు, మానవ అక్రమ రవాణా బాధితులు అలాగే ప్రకృతి వైపరీత్యాల బాధితులైన బలహీన వర్గాలకు దేశవ్యాప్తంగా ఎటువంటి రుసుము లేకుండా న్యాయ సేవలను అందించడం న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపు కోవడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. లోక్ అదాలత్‌లు కూడా న్యాయ వ్యవస్థ కార్యకలాపాలను పటిష్టంగా చేయడానికి మరియు సమాన ప్రాతిపదికన ప్రజల ధర్మాన్ని ప్రోత్సహించడానికి నిర్వహించబడతాయని గంధం సునీత అన్నారు. న్యాయపరమైన సేవలను తమ చట్టపరమైన హక్కుగా ఉచితంగా అందించా లనేది ప్రభుత్వాధికారులు అందించే చట్టపరమైన సందేశమన్నారు.
న్యాయ సేవల దినోత్సవం నేపధ్యంగా వివిధ పాఠశాలల్లో వ్యాస రచన, వక్తృత్వం, ప్రశ్నా వినోదం, చిత్రలేఖనం, స్కిట్ విభాగాల్లో పోటీలు నిర్వహించి, 22 మంది విజేతలకు ఈ రోజు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
గతంలో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, బూట్లు, గ్లౌజులు, ఏప్రాన్లు అందజేయగా ఈ కార్యక్రమంలో 40 మంది పారిశుద్ధ్య కార్మికులకు కళ్లజోళ్లను అందజేశారు.
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ
నాలుగు విభాగాలుగా ఏర్పాటు చేసుకున్నామని అందులో భాగంగా సుప్రీం కోర్ట్ లీగల్ సర్వీసెస్ కమిటీ (SCLC), హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీలు (HCLSC),జిల్లా న్యాయ సేవల అధికారులు (DLSA) తాలూకా లీగల్ సర్వీసెస్ కమిటీలు (TLSCలు) ఉన్నాయన్నారు. ఇవన్నీ సమాజంలోని పేద మరియు బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించ డానికి స్థాపించబడినవని పెట్టుకొన్నారు.
తొలుత గురువారం ఉదయం న్యాయ సేవల దినోత్సవ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నుండి పుష్కరఘాట్ వరకు చేసిన ర్యాలీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రత్యూష కుమారి , ప్యానల్ లాయర్లు, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది, జి.ఎస్.కె.ఎం. మరియు వీరవల్లి లా కళాశాలల విద్యార్ధులు పాల్గొని నినాదాలు చేస్తూ ప్రజలకు న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న న్యాయ సేవల గురించి తెలియజేశారు.
Prajavartha Online Telugu News