Breaking News

రబీ సీజన్లో పి.ఆర్-126 , ఎస్.ఎల్-10 వరి రకాల సాగు చేపట్టవద్దు

-రైతులకు జేసీ తేజ్ భరత్ విజ్ఞప్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రైతు లు రాబోయే దాళ్వా (రబీ)సాగు లో పి.ఆర్-126 మరియు ఎస్.ఎల్-10 వరి రకాల సాగు చేపట్టవద్దని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శుక్రవారం ఒక ప్రకటనలో రైతులకు విజ్ఞప్తి చేశారు. దాళ్వాలో ఎక్కువ మంది రైతులు పి.ఆర్ -126 మరియు ఎస్. ఎల్-10 రకం వరి సాగుకు సన్నద్ధం అవుతున్నారనే విషయం తమ దృష్టికి వచిందన్నారు. ఎవరైనా రైతులు ఈ రకం సాగు చేస్తే వారు ధాన్యాన్ని ప్రైవేటుగా మాత్రమే విక్రయించు కోవలసి ఉంటుందని ఆయన తెలియ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం పి.ఆర్.-126 మరియు ఎస్. ఎల్-10 రకం ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని స్పష్టం చేసిందన్నారు. రైతులు వరి పంటకు నాట్లు వేసే పద్ధతి కాకుండా నేరుగా విత్తనాలు వెదజల్లే పద్దతిని అలవాటు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ సూచించారు. తద్వారా నీటి వినియోగం, కూలీ ఖర్చులు, 7 రోజుల పంట కాలం తగ్గించు కోవచ్చన్నారు. రైతులు దాళ్వాసాగులో వ్యవసాయ శాఖ అధికారులు , శాస్త్రవేత్తలు చేసే సూచనలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధించాలని జేసీ తేజ్ భరత్ తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *