రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పిడింగయ్య గ్రామపంచాయతీ పరిధిలోని మీనాక్షి కాలనీలో 25 లక్షల రూపాయల వ్యయంతో అంతర్గత రహదారి పనులను చేపట్టడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తెలిపారు. శుక్రవారం టిడిపి పంచాయతీ పరిధిలో జిల్లా పంచాయతీ అధికారి స్థానిక ప్రజాప్రతినిధులు సమక్షంలో రహదారి పనులకు జేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని మౌలిక సదుపాయల కల్పనకు అత్యంత ప్రధాని ఇస్తూ దాసులవారీగా పల్లెలు చేపట్టడం జరుగుతుందన్నారు ఆ దిశలో నేడు పిడింగోయి పంచాయతీ పరిధిలోని మీనాక్షి కాలనీలో 25 లక్ష రూపాయల పంచాయతీ నిధులతో చేపట్టనున్న అంతర్గత రహదారి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ శంఖు స్థాపన కార్యక్రమంలో జిల్లా గ్రామపంచాయతీ అధికారి జేవీ సత్యనారాయణ స్థానిక నాయకులు బొప్పన సుబ్బారావు , చిర్రా రాజు , కార్యదర్శి రూప్ చంద్, సచివాలయ సిబ్బంది రవి తేజా, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News