Breaking News

కాతేరు సచివాలయ పరిధిలో 5314 మంది లబ్ధిదారులకు రూ.18.52 కోట్ల మేర ప్రయోజనం

– కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కాతేరు గ్రామ సచివాలయం పరిధిలో డిబిటి, నాన్ డిబిటి కింద 5314 మంది లబ్ధిదారులకు రూ.18,52,16,259 మేర ప్రయోజనం చేకూర్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.

శుక్రవారం రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామ సచివాలయం పరిధిలో వై ఎపి నీడ్స్ జగన్ – మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరించి, అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి కలెక్టర్ పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందని అన్నారు. ఇంకా ఎవరికైనా అర్హత కలిగి సంక్షేమ పథకాల ప్రయోజనం అందక పోతే మీ వాలంటీర్ ద్వారా గ్రామ సచివాలయానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇళ్లు లేని నిరుపేదలకు స్వంత ఇంటి కల సాకారం చేసే దిశలో ఉచితంగా ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. రాజమండ్రి , కాతేరు గ్రామ ప్రాంతాల వారికి తోర్రేడు ప్రాంతంలో లే అవుట్ ఇండ్ల స్థలాలు కేటాయించడం జరిగిందని లబ్దిదారులకు తెలిపారు. కేవలం కాతేరు సచివాలయం పరిధిలో 31 పథకాలు కింద రూ.18.52 కోట్ల మేర ప్రయోజనం చేకుర్చామని, అందులో నేరుగా నగదు బదలీ కింద 24 పథకాలు ద్వారా రు.12.06 కోట్లు, నాన్ డిబిటి కింద 7 పథకాలు ద్వారా రూ. 6.46 కోట్లు మేర ప్రయోజనం కల్పించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా అర్హత కల లబ్దిదారులు ప్రయోజనం పొందకుండా ఉంటే వారి వివరాలు అందచేయాలని సచివాలయ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరం పరిష్కరించేలా అధికారులను ఆదేశించడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పి. వీణా దేవి, ఎంపిడివో డి. శ్రీనివాస్, స్థానిక నాయకులు ఆచంట కళ్యాణ్ రామ్, తాడికొండ విష్ణు, సచివాలయ సిబ్బంది, లబ్దిదారులు పాల్గొన్నారు.

ప్రత్యక్ష నగదు బదిలీ(డిబీటీ) లబ్దిదారులు వివరాలు

జగనన్న అమ్మబడి పధకం క్రింద 281 మంది లబ్ధిదారులకు రు. 12431/-లు,

జగనన్న విద్యా దీవెన పధకం క్రింద 192 మంది లబ్ధిదారులకు రు. 76,18,331/-లు,

జగనన్న వసతి దీవెన పధకం క్రింద 153 మంది లబ్ధిదారులకు రు. 26,44,291/-లు,

వైఎస్సర్ రైతు భరోసా పధకం క్రింద 155 మంది లబ్ధిదారులకు రు. 69,29,450/-లు,

డా. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పధకం క్రింద 36 మంది లబ్ధిదారులకు రు.7,90,026/-లు,

వైఎస్సాఆర్ సున్నా వడ్డి పంట రుణాలు (రైతులు) పధకం క్రింద 50 మంది లబ్ధిదారులకు రు. 1,11,956/-లు,

రైతులకు ఇన్ పుట్ సబ్సిడి పధకం క్రింద 54 మంది లబ్ధిదారులకు రు.4,40,310/-లు,

వైఎస్సార్ మత్సకార భరోసా పధకం క్రింద 28 మంది లబ్ధి దారులకు రు.5,20,000/-లు,

వైఎస్సార్ పెన్షన్ కానుక పధకం క్రింద 421మంది లబ్ధిదారులకు రు.3,68,40,250/-లు,

వైఎస్సార్ చేయూత పధకం క్రింద172 మంది లబ్ధిదారులకు రు.74,06,250/-లు,

వైఎస్సార్ అసరా పధకం క్రింద 486 మంది లబ్ధిదారులకు రు.2,35,27,162/-లు,

వైఎస్సార్ సున్నా వడ్డి (SHGs) పధకం క్రింద 578 మంది లబ్ధి దారులకు రు.11,86,072/-లు,

వైఎస్సార్ కాపు నేస్తంపధకం క్రింద 38 మంది లబ్ధిదారులకు రు.16,20,000/-లు,

వైఎస్సార్ ఈబీసి నేస్తం పధకం క్రింద 37మంది లబ్ధిదారులకు రు.10,35,000/-లు,

వైఎస్సార్ కళ్యాణమస్తు/ షాధితోఫా పధకం క్రింద ఇద్దరు లబ్ధిదారులకు రు.1,00,000/-లు,

డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పధకం క్రింద 114 మంది లబ్ధిదారులకు రు. 58,17,128/-లు,

డా. వైఎస్సార్ ఆరోగ్య ఆసర పధకం క్రింద 69 మంది లబ్ధి దారులకు రు. 7,77,050/-లు,

హౌసింగ్ (లబ్ధిదారులకు నేరుగా చెల్లింపులు) పధకం క్రింద 83 మంది లబ్ధిదారులకు రు.66,52,456/-లు,

వైఎస్సార్ భీమా పధకం క్రింద 10 మంది లబ్ధిదారులకు రు.9,50,000/-లు,

వైఎస్సార్ వాహణ మిత్ర పధకం క్రింద 20 మంది లబ్ధిదారులకు రు 5,20,000/-లు,

వైఎస్సార్ నేతన్న నేస్తం పధకం క్రింద 13 మంది లబ్ధిదారులకు రు11,76,000/-లు,

జగనన్న చేదోడు రజకులు, టైలర్లు, నాయిబ్రాహ్మణులు) పధకం క్రింద 32 మంది లబ్ధిదారులకు రు.8,10,000/-లు,

వైట్ కార్డు హెూల్డర్స్ కు ప్రత్యేక కోవిడ్ సహాయము పధకం క్రింద 672 మంది లబ్ధిదారులకు రు. 6,72,000/-లు,

జగనన్న తోడు(వడ్డీ) పధకం క్రింద 46 మంది లబ్ధిదారులకు రు33,958/-లు,

ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ

మొత్తము 3930 మంది లబ్దిదారులకు రూ. 12,06,08,926 రూపాయలు జమ చేయగా ..

పరోక్ష ప్రయోజనాలు (NON DBT)

ఇంటి స్థలాలు (ధూ సేకరణ మరియు భూమి అభివృద్ధికి చెల్లించిన పరిహారము) పధకం క్రింద167 మంది లబ్ధిదారులకు రు.4,10,82,000/-లు,

జగనన్న విద్యాకానుక) పధకం క్రింద 80 మంది లబ్ధిదారులకు రు.5,68,160/-లు,

ఎనిమిదో తరగతి విద్యార్థులకు బై జస్ కంటెంట్తో కూడిన ట్యాబ్ ల పంపిణి పధకం క్రింద13 మంది లబ్ధిదారులకురు.1,71,886/-లు,

జగనన్న తోడు(రుణాలు) పధకం క్రింద 107మంది లబ్ధిదారులకు రు.19,92,233/-లు,

జగనన్న గోరుముద్ద) పధకం క్రింద 86 మంది లబ్ధిదారులకు రు.8,52,002/-లు,

వైస్సార్ సంపూర్ణ పోషణ పథకం క్రింద 127 మంది లబ్దిదారులకు రూ. 23,78,710/-లు ,

ఇంటింటికి రేషన్ (19.50 లక్షల మిలియన్ టన్నుల) పధకం క్రింద 804 మంది లబ్ధిదారులకు రు. 1,75,62,576/-లు,

పరోక్ష ప్రయోజనాలు (నాన్ డీబీటీ) మొత్తం రూ. 6,46,07,567/-

వెరసి మొత్తం డీబీటీ.. నాన్ డీబీటీ క్రింద 5,314 మంది లబ్దిదారులకు మొత్తము రూ. 18,52,16,259/-

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *