గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని అంతర్గత డ్రైన్లలో పూడికతీత పనులు చేపట్టాలని నగరపాలక సంస్థ అభివృద్ధి పనుల పర్యవేక్షణ కమిటి సభ్యులు ఇంజినీరింగ్ అధికారులను కోరారు. శనివారం కమిటి సభ్యులు నాజ్ సెంటర్ లోని ఎల్ఎల్ఆర్ రిజర్వాయర్ లో ఇంజినీరింగ్ అధికారులతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలోని ప్రధాన డ్రైన్లలో పూడిక తీయాలని, లేకుంటే మురుగు నిలిచి ప్రజారోగ్యానికి భంగం కల్గుతుందన్నారు. దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజారోగ్య సిబ్బంది, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. త్రాగునీటి సరఫరాలో క్లోరిన్ ను తగు మోతాదులో కలపాలన్నారు. నగరంలో జరుగుతున్న రోడ్లు, డ్రైన్ల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఎమినిటి కార్యదర్శుల ద్వారా పర్యవేక్షణ చేయించాలని సూచించారు. ఎస్.ఈ. కమిటి సభ్యులతో మాట్లాడుతూ ఇప్పటికే డ్రైన్ల శుభ్రానికి నాలా క్లీనింగ్ మెషిన్స్ అందుబాటులోకి వచ్చాయని త్వరలో అన్ని డ్రైన్ల శుభ్రానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేశామన్నారు. అభివృద్ధి కమిటి సభ్యులు సూచించిన అంశాలను నగర కమిషనర్ దృష్టికి తీసుకెల్తామని తెలిపారు.
కార్యక్రమంలో ఎస్.ఈ. భాస్కర్, ఈ.ఈ.లు సుందర్రామిరెడ్డి, కొండారెడ్డి, కోటేశ్వరరావు, శ్రీనివాస్, అభివృద్ధి పనుల పర్యవేక్షణ కమిటి సభ్యులు పరంధామయ్య, జోగారావు, నారాయణ రెడ్డి, అంజిరెడ్డి, డి.ఈ.ఈలు, ఏ.ఈ.లు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …