అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మంజూరు చేసిన గ్రామ సచివాలయ భవనాలు,రైతు భరోసా కేంద్రాల భవనాలు,వైయస్సార్ ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రాధాన్య భవనాల నిర్మాణాలను రానున్న మూడు మాసాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.జల్ జీవన్ మిషన్ మరియు ప్రయారిటీ భవనాలపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ వివిధ ప్రాధాన్య భవనాల ప్రగతిని ఆయన సమీక్షించారు.ప్రాధాన్య భవనాల నిర్మాణ పనులన్నిటినీ వేగవంతం చేసి నిర్దిష్ట గడువు ప్రకారం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎట్టి పరిస్థితుల్లోను మూడు మాసాల్లోగా మంజూరైన రైతు భరోసా కేంద్రాలు,గ్రామ సచివాలయ భవనాలు,వైయస్సార్ ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఆయా భనవాల పనులను మరింత వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు.అనంతరం జల్ జీవన్ మిషన్ తదితర అంశాలపై సిఎస్ సమీక్షించారు. ఈసమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ వివిధ ప్రాధాన్య భవనాల ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇంకా ఈసమావేశంలో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ సూర్యకుమారి,ఆశాఖ ఇఎన్సి బి.బాలు నాయక్,ఆర్ డబ్ల్యుఎస్ ఇఎన్సి ఆర్వి కృష్ణా రెడ్డి,సిఇ బి.రాజు తదితరులు పాల్గొన్నారు.అలాగే వీడియో లింక్ ద్వారా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణ బాబు,ఆర్ధికశాఖ కార్యదర్శి డా.కెవివి.సత్యనారాయణ,వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ జె.నివాస్ పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …