అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ స్ట్రక్చర్ కార్పొరేషన్ ఈరోజు సూక్ష్మ, స్థూల మరియు మధ్యతరహా పరిశ్రమల కు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ సపోర్టు అందించడం కోసం అవగాహన ఒప్పందం పై సంతకాలు చేయడమైనది. సిద్ది తరఫున హిమాన్షు ఆస్థానా, జనరల్ మేనేజర్, ఏపీఐఐసీ తరఫున శ్రీ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్ వీసి అండ్ ఎండి ఆఫ్ ఏపీఐఐసీ లు సంతకాలు చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు అయినటువంటి 531 పార్కుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి సూక్ష్మ స్థూల మరియు మధ్యతరహా పరిశ్రమలు కొత్తగా ఏర్పాటు అయ్యే వాటికి ముఖ్యమైన సమస్య బ్యాంకులో రుణము పొందడం.బ్యాంకు లోను సమస్యను అధిగమించడం కోసం ఏపీఐఐసీ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు లతో కూడా గతంలో అవగాహన ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు విరివిగా రుణాలను అందజేసి ఏపీఐసీ పార్క్స్ నందు త్వరగా వారి యూనిట్లను ఏర్పాటు చేయుటకు దోహదం చేస్తుంది. ఈ ఏర్పాటు వల్ల ఎంతోమంది అవుత్సాహిక పారిశ్రామికవేత్తలకు కొత్తగా యూనిట్లు పెట్టేవారికి, ఉన్న యూనిట్లు విస్తరణ కోసం ఎదురుచూసే వాళ్ళకి ఈ ఎంఓయు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం జిల్లా స్థాయిలో జోనల్ మేనేజర్లు బ్యాంకు తరపున ఒక ఫెసిలిటేషన్ ఆఫీసర్ని నియమించి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు రుణం పొందడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడమైనది. రాష్ట్రంలో ఉన్నటువంటి అవుత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్యాంకులను పారిశ్రామికవేత్తలను అధికారులను ఒక వేదిక మీదికి తీసుకొచ్చి వారి సమస్యలను పరిష్కరించడం కోసం ఈ అవగాహన ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుంది. వారి రుణ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు త్వరగా త్వరగా రుణా సౌకర్యాన్ని పొందడం ఈ ఒప్పందం ఎంతగానో తోడ్పడుతుంది.
ఈ కార్యక్రమంలో శ్రీ సుబ్బారెడ్డి సిజిఎం ఫైనాన్స్ ఏపీఐఐసీ శ్రీ రాజేంద్రప్రసాద్ బిజిఎం విజయవాడ బ్రాంచ్ సెల్ఫీ డాక్టర్ ఐ శ్రీనివాసులు, పి ఎం యు మేనేజర్, మహమ్మద్ జై ది, జిటి భారత్ తదితరులు పాల్గొన్నారు.