-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరగా రోడ్లను పూర్తి చేయండి అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కాంట్రాక్టర్లతో తమ చాంబర్లో నిర్వహించిన సమావేశం లో అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ కాంట్రాక్టర్లతో మాట్లాడుతూ రోడ్లను సకాలంలో పూర్తి చేయాలని ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని. కాంట్రాక్టర్లకు అప్పచెప్పిన పనులు విధుల ప్రకారం నిర్వహించాలని. పనులను త్వరతగతిన పూర్తి చేసి గడువులోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్లు, పేవర్ బ్లాగ్స్ తో ఉన్న ఫుట్పాత్లు ఎక్కడైతే బాలేవో అవన్నీ సరి చేయాలని. సరి చేసేటప్పుడు భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకుండా ఉండేటట్టు చూసుకోవాలని. నిర్మాణ పనులు చేసేటప్పుడు ఎక్కడా చెత్త వేయకుండా చూసుకోవాలని, పనుల అయిపోయిన తరవాత మెటీరియల్ తీసేసి పరిశుభ్రంగా ఉంచాలని. నగరాభివృద్దికి కాంట్రాక్టర్ల పాత్ర ఎక్కువ ఉంటుంది కాబట్టి, కాంట్రాక్టర్లు వాళ్లు పని చేయించుకునే పని వారితో సక్రమంగా, సకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యత ప్రమాణాలతో చేయాలని కమిషనర్ అన్నారు. ఈ సమావేశం లో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్ రావు పాల్గొన్నారు.