విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ నందు వివిధ క్యాడర్ల నందు 40 సంవత్సరాలుగా పనిచేయుచు, నేడు సర్కిల్ -3 నందు అసిస్టెంట్ కమీషనర్ గా పదవీ విరమణ చేయుచున్న యమ్, రాజకుమార్ కి ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించటమైనది. సదరు కార్యక్రమం మునకు డిప్యూటీ కమీషనర్ కుమారి. డి. వెంకట లక్ష్మి, జోనల్ కమీషనర్ యమ్. కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిప్యూటీ సిటీ ప్లానర్ జూబిన్ మరియు రిటైర్డ్ అసిస్టెంట్ కమీషనర్ సాంబశివరావు పాల్గొన్నారు. సదరు కార్యక్రమనకు అసోసియేషన్ సభ్యులు టి. నాగేశ్వరావు, జి.ప్రకాష్ సాగర్, బి. ఉదయ్ భాస్కర్, పి.మధుసూదానరావు, మారుతీరావు, శ్యాంసురేంద్రబాబు,బిల్ కలెక్టర్స్, రెవిన్యూ ఇన్స్పెక్టర్స్, ఇండోర్ సిబ్బంది మరియు సచివాలయ సీక్రెటరీస్ పాల్గొన్నారు.
మరియు విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో వాట్ స్పెషల్ సెల్లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న నాగ దుర్గ గురువారం అనగా నవంబర్ 30 2023న స్వచ్ఛంద పదవి విరమణ ఇచ్చారు.
ఏప్రిల్ 27 1988న రికార్డు అసిస్టెంట్ గా తమ సేవలు అందించి తదుపరి బిల్ కలెక్టర్ గా అవుట్ డోర్ లో ఫీల్డ్ వర్క్ చేసి ప్రజలకు తమ వంతు సేవలు అందించారు. 2019 లో పదోన్నతి పొంది 89 సచివాలయంలో అడ్మిన్ సెక్రెటరీ గా విశిష్ట సేవలు అందించి కార్పొరేషన్ నందు పలు విభాగాల్లో తన సేవలు అందించి, అధికారుల మన్నెలను పొందారు. 2021 జూనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొంది సర్కిల్ 3 రెవెన్యూ ఇన్స్పెక్టర్ గౌతమ సేవలను అందించారు.
విజయవాడ నగరపాలక సంస్థ నందు 35 సంవత్సరాల సుదీర్ఘ సేవలు అందించిన నాగ దుర్గ నవంబర్ 30 2023న స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.
అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ కె వీ సత్యవతి నగరపాలక సంస్థ సిబ్బంది పలు విభాగాల సూపరిండెంట్లు సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ ఇంటర్ అసిస్టెంట్లు కింద స్థాయి ఉద్యోగులు సన్మానం చేసి ఆవిడ సర్వీస్ లో అందించిన సేవలను అభినందించారు.