Breaking News

గోపాలపురం ఎంపీడీవో శ్రీదేవి సస్పెన్షన్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలు చేయడంలో నిర్లక్ష్య వైఖరి నేపథ్యంలో గోపాలపురం మండల అభివృద్ధి అధికారిణి ఆర్. శ్రీదేవి ని విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం , అభివృద్ధి పనులను పర్యవేక్షించడం పట్ల మండలంలో పేలవ ప్రదర్శన చూపడం, కలెక్టర్ నిర్వహించిన సమీక్ష సమావేశం లో హాజరు కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును పరిగణన లోకి తీసుకుని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ప్రభుత్వము అమలు చేస్తున్న పథకాలను అర్హులకు అమలు చేయడం లో నిర్దుష్ట కార్యాచరణ ప్రణాళిక ప్రకారం క్షేత్ర స్థాయి అధికారులు సిబ్బంది బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *