-జేసీ తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోటీ పరీక్షలలో విజయం సాధించడం కోసం నిశిత పరిశీలన, సరైన సమయంలో స్పందించడం ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ద్వారా మెరుగైన ర్యాంకు సాధించడం సాధ్యం అవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు. శనివారం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఉన్న బిసి స్టడీ సర్కిల్ ను సందర్శించి గ్రూప్ 2 అభ్యర్థులకు మోటివేషన్ తరగతులలో పాల్గొన్నారు. ఈ సందర్భoగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు చెందిన యువతకు మెరుగైన భవిష్యత్ అందచేసే క్రమంలో బిసి స్టడీ సర్కిల్ ద్వారా మెరుగైన శిక్షణ వసతులు కల్పించడం జరుగుతోందని అన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తీసుకోవలసి జాగ్రత్తలు పాటిస్తే తప్పకుండా విజయం సాధ్యం అవుతుందన్నారు. గ్రూప్ వన్ కోసం రెండు సార్లు పోటీ పరీక్షలలో పాల్గొని విజయం సాధించిన తీరును వివరించారు. పోటీ పరీక్షలలో ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వాలని, అదే సమయంలో సమయ పాలన ప్రకారం అన్ని ప్రశ్నలకు నిర్ణీత సమయం లో జవాబులు రాసేలా ప్రాక్టీస్ చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఈ స్టడీ సర్కిల్ ద్వారా 100 మంది యువతకు శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లక్ష్యాలను సాధించడానికి నిర్దిష్ట ప్రణాళికలు కీలకం అన్నారు. ఈ మోటివేషన్ కార్యక్రమంలో మేడిసెట్టి తాతబ్బాయి, బిసి సంక్షేమ, బీసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ పి ఎస్ రమేష్ తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News