రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కే. మాధవీలత వారి ఆధ్వర్యంలో కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లా పరిధిలో గుర్తించబడిన 25 ఓపెన్ ఇసుక రీచ్ లకు సంబంధించి అనుమతులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. కొవ్వూరు డివిజన్ పరిధిలోని 3 ఓపెన్ సాండ్ రెచేస్ వాలిడటీ డిసెంబర్ 7 , 27 తో ముగిసిన దృష్ట్యా రాబోయే రెండు రోజుల లో క్లియరెన్స్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా కమిటీ ఆమోదం పొంది నూతనంగా ఈ సి దరఖాస్తు చేసుకున్న రాజమహేంద్రవరం డివిజన్ లోని 4, కొవ్వూరు డివిజన్ లోని 18 కి సంబంధించి 15 రోజుల్లో క్లియరెన్స్ చెయ్యాలని ఆదేశించారు. అక్రమ త్రవ్వకాలు జరిపే వారి విషయంలో కటినంగా వ్యవహరించడం జరుగుతుందని హెచ్చరించారు.
భద్రత చర్యలలో భాగంగా బ్యారేజ్, వంతెన పరిసర ప్రాంతాల్లో 500 మీటర్ల వరకు ఎటువంటి ఇసుక త్రవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, అందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో బ్యారికెట్టింగ్ లను ఏర్పాటు చేసి నియంత్రణ పద్ధతులు అమలు చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి సమన్వయ శాఖలతో కమిటీ వేసినట్లు క్షేత్ర స్థాయి లో చేపట్ట వలసిన పనులను చేపట్టి నివేదిక అందచే య్యాలని ఆదేశించారు.
జిల్లాలో కొత్త గా 5 ప్లస్ హెక్టార్ల ఇసుక రిచేస్ కు సంబందించి గుర్తించాలని, అందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ చేపట్టి 15 రోజుల్లో కార్యాచరణ పూర్తి చెయ్యాలని స్పష్టం చేశారు. మార్గ దర్శకాలకు లోబడి అనుమతులు జారీ బోట్స్ మన్స్ సొసైటీ లకు చెందిన ఎన్ ఓ సి లను జారీ చెయ్యలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సమన్వయ శాఖ ల జిల్లా స్థాయి కమిటీ అధికారులు తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని , 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ, ట్రైనీ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్, జిల్లా మైన్స్ అధికారి ఎమ్. సుబ్రహ్మణ్యం, ఇరిగేషన్ ఈ ఈ , డిడి భూగర్భ జలాలు వై.శ్రీనివాస్, పోలీస్, సెబ్, డిపివో, రవాణా, ఈ ఈ గోదావరీ వాటర్ హెడ్స్, పర్యావరణ, మైన్స్ అధికారులు, ప్రతిమ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News