Breaking News

జిల్లా ప్రజలకు, అధికారులకు , ప్రజా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

-జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించడంలో  సమన్వయంతో పని చేద్దాం
-అన్ని రంగాల్లో జిల్లా అగ్రస్థానం లో నిలుపుదాం
-జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం జిల్లా కలెక్టర్ ను జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, కలెక్టరేట్ సిబ్బంది, పలువురు ప్రజా ప్రతినిధులు , జిల్లా కు చెందిన ప్రజలు తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత  తనను కలిసిన ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.  అందరం సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించాలని కోరారు. నూతన సంవత్సరంలో జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించేందుకు అధికార యంత్రాంగం తమ వంతు కృషి చేయాలన్నారు. ఆమేరకు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించి ప్రగతి మార్గాన పయనించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నూతన ఏడాదిలో  ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువచేయాలన్నారు. ఈ ఏడాది కొత్తగా వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద పెంచిన మొత్తం తో కలిపి రూ.3 వేల లబ్ధిని లబ్ధిదారులకు అందించడం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పథకం, వైఎస్సార్ ఆరోగ్య సురక్ష కింద రెండవ దశ కార్యక్రమం నిర్వహణ, ఆడుదాం ఆంధ్ర, ఇతర అన్ని రకాల సంక్షేమ పథకాలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించేందుకు అధికారులు తమ వంతు కృషి చేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలియ చేసిన వారిలో జిల్లా ఎస్పీ పి. జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్,  డి ఆర్వో జీ. నరసింహులు, ఆర్డీవో  ఏ. చైత్ర వర్షిణి, జిల్లా అధికారులు డిపివో జేవి సత్య నారాయణ,  ఏ . ముఖ లింగం, పి . జగదంబ, కె యస్ జ్యోతి, కే.విజయ కుమారి, పి ఎస్ రమేష్, డా వసుంధర, సత్యనారాయణ, సత్య గోవింద్, మాధవరావు , ఎ బి వి ప్రసాద్, డి. బాల శంకర్, జి. పరశురామ్, జీ. సాంబశివరావు, సిహెచ్. శ్రీనివాస్, కే.సునీల్ వినయ్, డా కె. వేంకటేశ్వర రావు, డా ఎస్. వసుంధర, డా వి. వినూత్న, డా పి. ప్రియాంక, పి. వీణా దేవి, వి . శాంత మణి, ఎల్ డి ఎం డివి ప్రసాద్,  సిహెచ్.శ్రీనివాస్, ఐ. కాశయ్య, ఎమ్ లక్ష్మణాచార్యులు, ఎమ్. సందీప్,  ఎం. రాంబాబు, రుక్మాందయ్య, కలెక్టరేట్, మునిసిపల్ కార్పొరేషన్, పోలీసు అధికారులు, కేంద్ర కారాగార అధికారులు, ఇతర అధికారులు , సిబ్బంది స్థానిక సంస్థల ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *