-ఆర్ట్స్ కళాశాల వేదికపై ఆకట్టుకున్న నృత్యాలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆడుదాం ఆంధ్రా జిల్లా క్రీడా ఉత్సవాల ముగింపు వేడుకలలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాల భైరవ ఆష్టకం, ఆనంద నర్తక గణపతి , ఆలరులు కురియగా – అన్నమయ్య కీర్తనలు , శ్రావణ బహుళఅష్టకం , సిరిత నవ్వుల వాడ, కులుకక నడవరో , వాడ వాడలా ధన్ ధనారే ధన్ సంప్రదాయ నృత్య కార్యక్రమం తో సినిమా పాటలతో కూడిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పిల్లలు వారిలో ఉన్న ప్రతిభ ను ప్రదర్శించి అందరి మెప్పు పొందడం ద్వారా ఆడుదాం ఆంధ్రా వేడుకలు అత్యంత ఘనంగా ముగిశాయి.
Prajavartha Online Telugu News