– బీ ఎస్ ఎమ్ వలీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలోని దుకాణములు, వాణిజ్య, వ్యాపార, సంస్థలు, మోటార్ రవాణా వాహన యాజమాన్యాలు, భవన, ఇతర నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టు లేబర్ ని వినియోగించే కాంట్రాక్టర్లు, ప్రథాన ఎంప్లాయర్లు అంతర్రాష్ట్ర వలస కార్మికులను వినియోగించే సంస్థలు యజమానులు విధిగా కార్మిక చట్టాల కింద ఫిబ్రవరి నెల 29వ తేదీ లోపు ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ చట్టం 2015 కింద రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొంది ఉండాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బి.యస్.యం. వల్లి విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానిక కార్మిక శాఖ కార్యాలయంలో దచాంబర్ ఆఫ్ కామర్స్, వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బి.యస్.యం. వల్లి మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ దుకాణములు మరియు సంస్థల చట్టం, 1988, బిల్డింగ్ మరియు ఇతర నిర్మాణ వర్కర్స్ యాక్ట్, 1996 , కాంట్రాక్టు లేబర్ ఆక్ట్,1970 , పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ ఆక్ట్, 1972 , మోటార్ రవాణా వర్కర్స్ ఆక్ట్, 1961 , బీడీ అండ్ సిగార్ వర్కర్స్ ఆక్ట్, 1966 ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ ఆక్ట్, 1979 కి లోబడి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందన్నారు . ఆయా సంస్థలన్నీ విడి విడిగా కాకుండా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆక్ట్, 2015 క్రింద కార్మిక చట్టలన్నిటికీ ఒకే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ / లైసెన్సు పొందే వెసులుబాటు ఉన్నదని వలీ తెలిపారు. ఇది వరకే కార్మిక చట్టాల క్రింద రిజిస్ట్రేషన్ చేసుకున్న సంస్థలు వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రెన్యువల్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా ఆయన కోరారు.
ఫిబ్రవరి నెల 29 వ తేదీలోపు ఈ విధముగా రిజిస్ట్రేషన్ చేసుకొవాలని , ఒక ఈలోగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందకపోతే చట్టపరమైన చర్యలకు గురి అవుతారని తెలియ చేశారు. ఈ సమావేశములో రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్సు ప్రతినిధులు, వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులు, యజమానులు, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News