రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ జిల్లా కొమ్మాదిలో విశాఖపట్నం రూరల్ తహసీల్దార్ రమణయ్య హత్య సంఘటన ను జిల్లా కలెక్టర్ కే. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తదితరులు శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. శనివారం కలెక్టరేట్ లో రమణయ్య మృతికి రెండు నిముషాలు మౌనం పాటించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జి. నరసింహులు, కే ఆర్ ఆర్ సి ఎస్ డి టి కృష్ణ నాయక్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అప్సా అధ్యక్షులు జి. బాపిరాజు, కార్యదర్శి ఎమ్ కే ప్రసాద్, రాజమండ్రీ డివిజన్ అధ్యక్షులు సిహెచ్. సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పై దాడులను, హత్యలను ఖండిస్తున్నట్లు సంఘ నాయకులు పేర్కొన్నారు. దోషులను సాధ్యమైనంత తొందరలో అరెస్ట్ చేసి, శిక్షించాలని డిమాండ్ చేశారు.
Prajavartha Online Telugu News