“మేరా పెహ్లా వోట్ దేశ్ కే లియే” ప్రచారం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :

“మేరా పెహ్లా వోట్ దేశ్ కే లియే” ప్రచారం యువ ఓటర్లను ప్రోత్సహించటం మరియు దేశం యొక్క విధిని రూపొందించడంలో వారి ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం. జి పుల్లా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ద్వారా నిర్వహించబడిన “మేరా పెహ్లా వోట్ దేశ్ కే లియే”ప్రచారం మొదటిసారిగా ఓటు హక్కు పొందిన వారికి అవగాహన కల్పించడంతోపాటు ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల బాధ్యతాయుత భావాన్ని పెంపొందించడానికి ప్రయత్నించింది. ఈ ప్రచారంలో బాగంగ ఓటరు అవగాహన వర్క్‌షాప్,ఫ్లాష్ మాబ్,సోషల్ మీడియా ప్రచారం,సెమినార్ మరియు డిబేట్,క్విజ్ క్వెస్ట్,క్యాంపస్ మార్చ్,సెల్ఫీ పాయింట్ సెటప్ వంటి కార్యక్రమలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. శ్రీనివాస్ రెడ్డి, డా. దేవికా దేవి, వై. వి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య భాగస్వామ్య సంస్కృతిని పెంపొందించడం ద్వారా, బాధ్యతగల ఓటర్లకు పునాది వేసింది. ఏపీ రాష్ట్రంలో ఈ ప్రచార కార్యక్రమానికి ఎంపికైన ఏకైక కళాశాల కావటం పట్ల కళాశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *