విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్.హెచ్.ఆర్.సి) చైర్పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రాకు మంగళవారం రాత్రి విజయవాడలోని హోటల్ వివంత వద్ద జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు స్వాగతం పలికారు. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ సారథ్యంలోని బృందంలో కమిషన్ సభ్యులు డాక్టర్ డి.ఎం.మూలే, రాజీవ్ జైన్, విజయభారతి సయాని, సెక్రటరీ జనరల్ భరత్ లాల్, రిజిస్ట్రార్ (లా) సురాజిత్ డే, డి ఐ జి పాటిల్ కేతన్ బలిరాం, డిప్యూటీ రిజిస్ట్రార్ (లా), నోడల్ అధికారి ఇంద్రజీత్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈ నెల 6వ తేదీ బుధవారం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని బృందం నగరంలోని లబ్బీపేట పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో క్యాంప్ సిట్టింగ్ నిర్వహించనుంది. రాష్ట్రానికి సంబంధించి కేసుల విచారణకు ఈ క్యాంపు సిట్టింగ్ నిర్వహించనుంది.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …