దాదాపు రూ. 6 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన హోంమంత్రి తానేటి వనిత..

నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో దాదాపు 3 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో భాగంగా పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, రెండు చోట్ల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లను రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ప్రారంభించారు. మరో రెండు కోట్ల 95 లక్షల అంచనా అంచనా వేయడంతో నిర్మించే పోతవరం-యర్నగూడెం రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగనన్న ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రతిపక్షాలకు జగనన్నను ఎదుర్కొనే ధైర్యం లేక లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధపు హామీలు, విషపు ప్రచారాలతో గుంపులు గుంపులుగా వస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమానికి.. జగనన్న ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమానికి తేడాలను ప్రజలు గమనించాలని ప్రజలను కోరారు. ముందుగా పోతవరం గ్రామంలో శ్రీ పాప నాగు వారి లే అవుట్ నందు 60KL O.H.S.R. ట్యాంకు నిర్మాణాన్ని హోం మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో ఒక కోటి 4 లక్షల రూపాయలను జలజీవన్ మిషన్ నిధుల క్రింద కేటాయించారు. గ్రామంలో శ్రీశ్రీ కళ్యాణ మండపం వద్ద కానూరి హేమమాలిని నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపు-26 ను హోంమంత్రి ప్రారంభించారు. అనంతరం ఎస్సీ కాలనీ కొత్తపేటలో గడపగడపకు మన ప్రభుత్వం నిధులతో 20 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లు ను ప్రారంభించారు. హై స్కూల్-సుభద్ర పాలెం రోడ్డులో గడపగడపకు మన ప్రభుత్వం, ఎంపీపీ నిధులతో నిర్మించిన 49 లక్షల విలువైన సిసి రోడ్లు, కల్వర్టుల పనులను ప్రారంభించారు. అలాగే 20 లక్షల రూపాయల వ్యయంతో గడపగడపకు మన ప్రభుత్వం నిధులతో నిర్మించిన సిసి రోడ్డు, రిటైనింగ్ వాల్ ను ప్రారంభించారు. పోతవరం రైతు భరోసా కేంద్రం వద్ద ఒక కోటి నాలుగు లక్షల వ్యయంతో జల జీవన్ మిషన్ నిధులతో నిర్మించిన 60KL O.H.S.R. ట్యాంకు నిర్మాణాన్ని హోం మంత్రి ప్రారంభించారు. గ్రామ పర్యటనలో చివరిగా.. రెండు కోట్ల 95 లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన పోతవరం నుండి యర్నగూడెం వెళ్లే రోడ్డుకు ఆమె శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు, నల్లజర్ల మండలం నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *