ఓట్ల లెక్కింపు కేంద్రంలో మూడంచెల భద్రత

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే ఎన్నికల్లో కృష్ణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఓట్ల లెక్కింపు కేంద్రంలో మూడంచెల భద్రత కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, రిటర్నింగ్ అధికారులతో కలిసి కృష్ణ విశ్వవిద్యాలయం సందర్శించి ఓట్ల లెక్కింపునకు చేయవలసిన ఏర్పాట్లు గురించి అధికారులతో చర్చించారు. జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు, 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలు భద్రపరిచేందుకు గుర్తించిన స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు రూములు,పరిశీలకుల గదులు, కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద, కౌంటింగ్ హాళ్ల వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యలు గురించి జిల్లా ఎస్పీతో చర్చించారు. కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు రాకపోకలకు మార్గాలు ఏర్పాటు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024 సందర్భంగా కృష్ణా విశ్వవిద్యాలయంలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో గల 7 అసెంబ్లీ నియోజక వర్గాల పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపునకై ఈవీఎంలు కౌంటింగ్ కేంద్రానికి తరలించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం సెగ్మెంట్ల వారీగా పార్లమెంటు, అసెంబ్లీ ఈవీఎంలు భద్రపరిచేందుకు వేరువేరుగా స్ట్రాంగ్ రూములు, మరియు ఓట్లలెక్కింపు రూములు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. 100 మీటర్లు, 200 మీటర్లు, 300 మీటర్ల పరిధిలో ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. 24 గంటలు భద్రత కల్పించేందుకు మూడు షిఫ్టులలో సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను ఆయా నియోజకవర్గ స్ట్రాంగ్ రూములలో భద్రపరచుటకు, ఓట్ల లెక్కింపునకు వేరువేరు మార్గాల ఏర్పాటుకు బారికేడింగ్ చేయించాలని అధికారులను ఆదేశించామన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే. చంద్రశేఖర రావు, పెనమలూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్డీవో డి. రాజు, గుడివాడ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్డీవో పద్మావతి, మచిలీపట్నం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్డీవో ఎం వాణి, పెడన నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ముడ విసి పి. వెంకటరమణ, పామర్రు రిటర్నింగ్ అధికారి కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, అవనిగడ్డ రిటర్నింగ్ అధికారి గుడివాడ మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం , ఏ ఎస్ పి లు ఎస్విడి ప్రసాద్, జి వెంకటేశ్వరరావు, కృష్ణ విశ్వవిద్యాలయ విసి జ్ఞానమణి, రిజిస్ట్రార్ శోభన్ బాబు, ఏడి సర్వే వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సమన్వయ అధికారి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *