లబ్ధిదారులకు రుణాలు, ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ (NAMASTE) కింద సఫాయి మిత్రలకు (మురుగు, సెప్టిక్ ట్యాంక్ కార్మికులు) జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ 113 మంది లబ్ధిదారులకు స్త్రీ నిధి ద్వారా రూ.78.15 లక్షల రుణ మంజూరు పత్రాలు, ఆయుష్మాన్ హెల్త్ కార్డ్‌లను పంపిణీ చేశారు. షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులతో సహా వెనుకబడిన వర్గాలకు చెందిన వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో బుధవారం న్యూఢిల్లీ నుంచి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో సంభాషించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఇతర అధికారులతో కలసి పాల్గొన్నారు.

ఈ క్రమంలో ఆయన దేశంలోని అణగారిన వర్గాలకు ఉద్దేశించిన ప్రధాన్ మంత్రి సామాజిక్ ఉత్థాన్ ఏవం రోజ్‌గార్ అధారిత్ జనకళ్యాణ్ (PM-SURAJ) జాతీయ పోర్టల్‌ను ప్రారంభించారు. తొలిత కార్యక్రమంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందిస్తున్న వివిధ రకాల ప్రభుత్వ పథకాల వివరాలను ఆయా బ్యాంక్ అధికారులు వివరించారు.

ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ షేక్ షాహిద్ బాబు, బీసీ వెల్ఫేర్ ఈడి కే రాజేంద్ర బాబు, డి ఆర్ డి ఏ పిడి పి ఎస్ ఆర్ కె ప్రసాద్, పీఎంయు స్టేట్ కోఆర్డినేటర్ అతుల్య, స్త్రీ నిధి ఏజీఎం శ్యామలాదేవి, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆర్ ఎం శివరామ ప్రసాద్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ పి.ప్రకాష్ రత్నబాబు, ఎల్ డి ఎం జైవర్ధన్, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *