స్టేక్ హోల్డర్స్ కు సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం సుప్రీం కోర్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు వారి ఆదేశాను సారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాదికార సంస్థ నందు “మోటార్ వాహనాల సవరణల చట్టం మరియు మోటార్ వాహనాల సవరణ నిబంధనలు, 2022” పై స్టేక్ హోల్డర్స్ కు సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. 5 వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి. విజయ్ గౌతమ్ ఈ సదస్సులో మోటార్ వాహనాల సవరణల చట్టంలోని పలు సెక్షన్ల పై అవగాహన కల్పించారు. ఈ సవరణలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ, పోలీసు వారు, ఇన్షూరెన్స్ సంస్థల వారు పాటించాల్సిన నిబందనల గురించి తెలియజేశారు. యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మరియు ఇతర సంబందిత ప్రక్రియలలో పాటించంల్సిన నిబందనలు తెలియజేశారు. మోటార్ వాహనాల సవరణల చట్టాలు, నిబందనలకు సంబందించి గౌరవ సుప్రీం కోర్టు వారి సూచనలు భాగస్వాము లందరూ తప్పనిసరిగా పాటించాలని 9 వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి ఎం. మాధురి తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ 8 వ అదనపు జిల్లా న్యాయమూర్తి వై. బెన్నయ్య నాయుడు, 10 వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం. నాగేశ్వర్రావు, 1వ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ కె. జానీ బాషా, వివిద ఇన్షూరెన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం 9 వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి ఎం. మాధురి లీగల్ ఎయిడ్ కౌన్సెల్స్ తో మానిటరింగ్ అండ్ మెంటారింగ్ కమిటీ సమావేశం నిర్వహించి ఉచిత న్యాయ సహాయం అందిస్తున్న కేసుల పురోగతిని సమీక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *