ప్రజలు రూ.50 వేల మించి నగదు వెంట తీసుకుని వెళ్ళేరాదు

-అటువంటి సందర్భాల్లో తగిన ఆధారాలు వెంట ఉంచుకోవడం పై ప్రజల్లో అవగాహన కల్పించాలి
-జిల్లాలో ఇప్పటి వరకు 13 మంది నుంచీ 23.44 లక్షలు సీజ్ చేసి, రూ.21.44 విడుదల చెయ్యడం జరిగింది
-పోస్టల్ బ్యాలెట్ పై టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం
-జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల నియమావళి అమలు సమయంలో రూ.50 వేలకు మించి నగదు రూపంలో వెంట తీసుకుని వెళ్లరాదని , ఆయా సందర్భాల్లో ఖచ్చితంగా తగిన ఆధారాలను తనిఖీ బృందాలకు చూపాల్సి ఉంటుందనీ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చెయ్యడంతో పాటు వివిధ నోడల్ అధికారులను నియమించి, పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఆ క్రమంలో ఎమ్ సీ సి, సి విజిల్, ఎన్ కోర్, ఫిర్యాదులు, సువిధ బృందాలు, వివిధ న్యూస్ ఛానళ్ల, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాలు పై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యటన నేపథ్యంలో నియోజక వర్గాల పరిధిలో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లు, పొలీంగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు వరకు నియోజక వర్గాల స్ధాయిలో పూర్తీ స్ధాయిలో సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు మేరకు అత్యవసర సేవలు అందించే శాఖలకు పోస్టల్ బ్యాలెట్ జారీ కోసం తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అమేరకు ఆయా విభాగాల నుంచి జాబితాను సిద్ధం చేసుకుని నిర్ణీత ప్రోఫార్మా లో నివేదిక అందజేయాలని ఆదేశించారు.

ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల నమోదు కోసం 1950 ట్రోల్ ఫ్రీ నెంబర్ తో పాటు గా జిల్లా స్థాయిలో టోల్ ఫ్రీ నెంబర్ 1800- 425 – 2540  కలెక్టరేట్ లో ఏర్పాటు చెయ్యడం జరిగిందనీ , వీటితో పాటు గా సి విజిల్ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. ఆయా ఫిర్యాదుల పరిష్కారము కోసం 24 x 7 మూడు షిఫ్ట్ లలో సిబ్బందిని , పర్యవేక్షణ అధికారిని నియమించినట్లు తెలిపారు. సి విజిల్

నామినేషన్ దాఖలు చేయడానికి మోడల్ నామినేషన్ పత్రాలని అందుబాటులొ ఉంచాలని, వాటిపై అవగాహన కల్పించడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్వో లకి కలెక్టర్ మాధవీలత తెలియ చేశారు.

.సి విజిల్ యాప్ ద్వారా అందిన 27 ఫిర్యాదులలో18 వాటిపై చర్యలు తీసుకోగా, ఐదు ఉపసంహరించుకోవడం జరిగిందనీ, నాలుగు పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.

ఎన్ కోర్ బృందాలు ద్వారా ఇప్పటి వరకు 13 మంది నుంచీ రూ. 23.44 లక్షలు సీజ్ చేసి, తగిన ఆధారాల మేరకు రూ.21.44 విడుదల చెయ్యడం జరిగిందనీ పేర్కొన్నారు. అందులో భాగంగా నియోజక వర్గాల వారీగా నిడదవోలు రూ.12.88 లక్షలు, రాజమండ్రి అర్బన్ రు.2.65 లక్షలు, గోపాలపురం రూ.4 లక్షలు, అనపర్తి రూ.1.06 లక్షలు, రాజమండ్రీ రూరల్ రూ. ఒక లక్ష, రాజానగరం రూ.1.85 లక్షలు సీజ్ చెయ్యగా తగిన ఆధారాలు చూపిన తదుపరి 11 మందికి సంబందించిన రు.23, 43,550 విడుదల చెయ్యడం జరిగిందని తెలిపారు.

పోస్టల్ బ్యాలెట్ కి సంబందించిన 85 ప్లస్, దివ్యాంగుల, అత్యవసర సేవల తదితర ఓటర్ల కు చెందిన దరఖాస్తు విధానం, తీసుకోవలసిన ధృవీకరణ పత్రాలు, గెజిటెడ్ అధికారి నిర్థారణ తదితర అంశాలకి సంబంధించిన ఎన్నికల కమీషన్ జారీ చేసిన పట్టికలు, మార్గదర్శకాలు మేరకు ఆర్వో లు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, ఇతర రిటర్నింగ్, సహయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *