-అప్తాలీక్ పరికరాన్ని అందచేసిన డెక్కన్ కెమికల్స్ ప్రవేట్ లిమిటెడ్ ఎండి జి. మనోహర్
-కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు సామాజిక బాధ్యతగా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి.
-కలెక్టర్ మాధవీలత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ.20 లక్షలు ఖరీదు చేసే కంటి పరిక్ష మరియు శస్త్ర చికిత్స పరికరములు దాతల సహకారంతో అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.
శనివారం ఉదయం స్థానిక సామజిక ఆరోగ్య కేంద్రంలో “అప్తాలీక్ ” కంటి చికిత్స యూనిట్ కు కలెక్టర్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రానున్న రోజుల్లో కొవ్వూరులోనీ సామాజిక ఆరోగ్య కేంద్రంలో కాంటారాక్ట్ వంటి ఆధునిక కంటి శస్త్ర చికిత్సలు అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతోందని, ఆ క్రమంలో దాతలు సహాకారంతో రూ.20 లక్షల విలువైన పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సామజిక బాధ్యత లో భాగంగా డెక్కన్ పైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జి . మనోహర్ ఈసారి ముందుకు వొచ్చి రూ.20 లక్షల ఖరిదైన వైద్య పరికరం అందచేసి ఎందరికో స్పూర్తిగా నిలిచారని అభినందించారు. ఈ సందర్భం గా ప్రసూతి వార్డు ను తనిఖీ చేసిన కలెక్టర్ వారితో మాట్లాడుతూ, ఆసుపత్రిలో ఇక్కడ అందుతున్న వైద్య, అనుబంధ సేవలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. రక్త హీనత అధిగమించేందుకు ఐరన్ పోషకాలు కలిగిన ఆహారం తప్పకుండా తీసుకోవాలి అని పేర్కొన్నారు. కంటి వైద్యులు డా. శాంతి కమల, అనపర్తి డా. అశోక్ కుమార్ అధ్వర్యంలో కంటి శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, సహయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి , డెక్కన్ పైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జి . మనోహర్ , మెడికల్ సూపరింటెండెంట్, డా కే. సాయి కిరణ్, సూపరింటెండెంట్, కంటి వైద్యులు , డా. శాంతి కమల, సామాజిక ఆరోగ్య కేంద్రం కొవ్వూరు వైద్యులు, నర్సులు తదితరులు పాల్గొన్నారు.